మహేష్ రాజమౌళి కాంబో మూవీ భారతీయ సినిమా చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
మహేష్ రాజమౌళి కాంబో మూవీ భారతీయ సినిమా చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 1000 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుండగా 2027 సంవత్సరంలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే విజయేంద్ర ప్రసాద్( Vijayendra Prasad ) ఈ సినిమా గురించి మాట్లాడుతూ మారోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ సినిమా పూర్తిస్థాయిలో అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుందని ఆయన అన్నారు. ఇండియాలో ఈ మధ్య కాలంలో ఈ తరహా కథాంశంతో సినిమా తెరకెక్కలేదని ఆయన కామెంట్లు చేశారు. మహేష్ బాబు(Mahesh babu) గత సినిమాలకు భిన్నమైన కథతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ సినిమా కథ కాంటెంపరరీలో సాగుతుందని ఆయన అన్నారు. ఈ సినిమా కథ విషయంలో చాలా కసరత్తు చేశానని విజయేంద్ర పేర్కొన్నారు. ఈ సినిమా సరికొత్త అడ్వెంచర్ అనుభవాన్ని అందిస్తుందని ఆయన వెల్లడించారు. విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా బాహుబలి2 సినిమాను మించి హిట్ అవుతుందని చెప్పకనే చెప్పేశారు. మహేష్ కు జోడీగా ప్రియాంక చోప్రా(priyanka chopra) ఈ సినిమాలో నటిస్తుండగా వీళ్లిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ తక్కువనే సంగతి తెలిసిందే. మహేష్ ఈ సినిమాకు 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. మహేష్ రాజమౌళి (Rajamouli)కాంబో మూవీకి సంబంధించిన అధికారిక అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. మహేష్ జక్కన్న కాంబో మూవీ విజువల్ వండర్ అని ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేయడం పక్కా అని తెలుస్తోంది. రాజమౌళి మాత్రం ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎక్కడా స్పందించలేదు. మహేష్ బాబు కూడా ఈ సినిమా విషయంలో ఒకింత సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారని తెలుస్తోంది.