పవన్ కళ్యాణ్(Pawan Kalyan), రేణు దేశాయ్(Renu Desai) ల తనయుడు అకీరా నందన్(Akira Nandhan) ఎంట్రీ కోసం మెగా ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదరు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు తెరపై కనిపిస్తాదా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

vijayendra prasad On Akira Tollywood Entry
పవన్ కళ్యాణ్(Pawan Kalyan), రేణు దేశాయ్(Renu Desai) ల తనయుడు అకీరా నందన్(Akira Nandhan) ఎంట్రీ కోసం మెగా ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదరు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు తెరపై కనిపిస్తాదా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదివరకే అకీరా ఎంట్రీపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అంతే కాదు హీరోగా ఎంట్రీ కోసమే ఫారెన్ లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడంటూ ఎన్నో వార్తలు హైలెట్ అయ్యాయి. ఈక్రమంలో ఈమధ్య రేణు కూడా స్పందించారు.
అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. అందరిలానే నాకు కూడా అకీరాను బిగ్ స్క్రీన్ పై చూడలని వుందని చెప్పుకొచ్చారు రేణు. ఇదే క్షణంలో అకీరాకి హీరో అవ్వాలనే ఆసక్తి ఇప్పరివరకూ రాలేదని చెప్పారు.” అకీరాది చాలా భిన్నమైన వ్యక్తిత్వం. తను పియానో, ఫిల్మ్ ప్రొడక్షన్, యోగా, మార్సల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ ఇవన్నీ నేర్చుకున్నాడు. కాని తాను హీరో అవుతానని మాత్రం ఎప్పుడూ చెప్పలేదు అన్నారు.
తాజాగా టైగర్ నాగేశ్వారరావు(Tiger Nageswar Rao) ఈవెంట్ లో సరదా సన్నివేశం జరిగింది. అఖీరా టాలీవుడ్ ఎంట్రీ గురించి రాజమౌళి(Rajamouli) తండ్రి విజయేంద్ర ప్రసాద్(Vijayendra Prasad) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రవితేజ - వంశీ కాంబినేషన్లో రూపొందిన 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా ఈ నెల 20వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంటుకు విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ .. "రేణు దేశాయ్ గారు తెలుగు సినిమాలు చేయకపోయినా, తెలుగు ప్రేక్షకులకు దగ్గరగానే ఉన్నారు. ఆమె వాళ్ల అబ్బాయిని హీరోగా చేయాలి .. సినిమాలో అతని తల్లి పాత్రను ఆమెనే చేయాలనేదే నా మాట" అనడంతో ఒక్కసారిగా ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. అంతే కాదు రేణు దేశాయ్ సంతోషం తట్టుకోలేకపోయారు.
"రవితేజ టాలెంట్ గురించి నాకు తెలుసు. భారతదేశమంతా ఆయన తన కీర్తి పతాకాన్ని ఎగరేయాలని కోరుకుంటున్నాను. వచ్చేది దసరా .. దుర్గమ్మవారికి ఎదురుగా ఎవరూ నిలబడలేరు .. ఆ తల్లి వాహనమైన 'టైగర్' ముందు కూడా ఎవరూ ఎదురుగా నిలబడలేరు. ఈ దసరా నీదే .. నీదే" అని అన్నారు. ఇక విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. గతంలో మణిరత్నం గారి 'నాయకుడు' వంటి సినిమా చూస్తూ, ఇలాంటి సినిమాలు తెలుగులో ఎప్పుడు వస్తాయా అనుకునేవాడిని .. అలాంటి సినిమా ఇప్పుడు వచ్చింది" అంటూ ఆడిటోరియంను హూషారెత్తించారు. 'పుష్ప' తరువాత ట్రైలర్ తోనే నన్ను కథలోకి .. ఆ కాలంలో తీసుకెళ్లిన సినిమా ఇది. ట్రైలర్ చూడగానే డైరెక్టర్ కి కాల్ చేసి అభినందించాను.
