2020 లో .. అంటే సరిగ్గా మూడేళ్ల క్రితం సరిలేరు నీకెవ్వరు సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది విజయశాంతి(Vijayshanti). మహేష్ బాబు(Maheshbabu) నటించిన ఈ మూవీలో ఆమెది కీలకపాత్ర. ఈ సినిమాలో కథ మొత్తాన్ని తన వైపు తిప్పుకుంది బ్యూటీ. అయితే ఈమూవీ తరువాత మరే సినిమాలో కనిపించలేదు విజయశాంతి.

2020 లో .. అంటే సరిగ్గా మూడేళ్ల క్రితం సరిలేరు నీకెవ్వరు సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది విజయశాంతి(Vijayshanti). మహేష్ బాబు(Maheshbabu) నటించిన ఈ మూవీలో ఆమెది కీలకపాత్ర. ఈ సినిమాలో కథ మొత్తాన్ని తన వైపు తిప్పుకుంది బ్యూటీ. అయితే ఈమూవీ తరువాత మరే సినిమాలో కనిపించలేదు విజయశాంతి. ఈసినిమా కూడా అనిల్ రావిపూడి(Anil Ravipudi) ఎంతో పట్టుదలతో ప్రయత్నిస్తే కాని ఒప్పుకోలేదు విజయశాంతి.

విజయశాంతి వచ్చిన ప్రతీ సినిమా చేయను అని తెగేసి చెప్పేసింది. మరీముఖ్యంగా తల్లి, చెల్లి, అక్క పాత్రలు అస్సలు నటించను అని తేల్చేసింది. ఈమూవీ తరువాత ఎంత మంది ప్రయత్నించినా.. ఏమాత్రం ఏపయోగం లేకుండా పోయింది. అందుకే సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత ఆమె మరో ప్రాజెక్ట్ అంగీకరించలేదు. తాజాగా ఇప్పుడు మరో సినిమాకు ఓకే చేశారు. దాదాపు మూడేళ్ల తర్వాత కొత్త సినిమాకు సైన్ చేసింది విజయశాంతి. శుక్రవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యింది.

అశోక క్రియేషన్స్(Ashok Arts), ఎన్టీఆర్ ఆర్ట్స్(NTR Arts) బ్యానర్లపై కల్యాణ్ రామ్(Kalyan Ram) హీరోగా.. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ఇందులో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఇదే సినిమాలో విజయశాంతి కీలకపాత్రలో నటిస్తున్నారు. హైదరాబాద్ లో జరిగన ఈ మూవీ ప్రారంభోత్సవ వేడుకలో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మహూర్తపు సన్నివేశానికి విజయశాంతి క్లాప్ కొట్టగా.. మురళీ మోహన్(Murali Mohan) కెమెరా స్విచ్ ఆన్ చేశారు. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నారు.

గతంలో సరిలేరు నీకెవ్వరు సిసిమా తరువాత ఎన్నో ఆఫర్లు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. కాని అన్నింటినిరిజెక్ట్ చేశారు విజయ శాంతి. అంతే కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా దేవరలో కూడా ఆమెను తీసుకోవాలి అని విశ్వ ప్రయత్నం చేశారు. కాని అది సాధ్యంకాలేదు. ఆమె ఆసినిమానురిజక్ట్ చేశారు. తమ్ముడు సినిమాను రిజెక్ట్ చేసిన రాములమ్మ.. అన్నకల్యాణ్ రామ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ఇచ్చింది.

Updated On 22 Oct 2023 2:31 AM GMT
Ehatv

Ehatv

Next Story