బుచ్చి బాబు బలమైన పాత్రను విజయశాంతి కోసం వివరించినట్లు

‘గ్లోబల్ స్టార్’ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్‌తో ‘గేమ్ ఛేంజర్’లో నటిస్తున్నారు. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. శంకర్ భారతీయుడు-2 విడుదలవ్వగానే ఈ సినిమాను భారీ ప్రమోషన్స్ తో విడుదల చేయనున్నారు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తేజ్ ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సనా దర్శకత్వం వహించనున్న స్పోర్ట్స్ డ్రామాలో నటించనున్నారు. బుచ్చిబాబు ఈ సినిమాకు సంబంధించిన టెక్నీషియన్స్, స్టార్ కాస్ట్ విషయంలో ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు.

ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. చరణ్‌కి జోడీగా నటించడానికి జాన్వీ కపూర్ ను తీసుకున్నారు. పాటలను కంపోజ్ చేయడానికి A. R. రెహమాన్‌ని తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో చరణ్ తల్లిగా నటించడానికి సీనియర్ నటి విజయశాంతిని సంప్రదించారు. బుచ్చి బాబు బలమైన పాత్రను విజయశాంతి కోసం వివరించినట్లు తెలుస్తోంది. దీనిపై విజయశాంతి ఇంకా ఆమోదం తెలపలేదని తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Updated On 21 May 2024 2:40 AM GMT
Yagnik

Yagnik

Next Story