హీరోయిన్ తమన్నా భాటియా(tamannaah Bhatia) ఓ పక్క సినిమాలు, మరో పక్క వెబ్ సిరీస్‌లతో చాలా బిజీగా ఉన్నారు. సినిమా పరిశ్రమలో అడుగుపెట్టినప్పుడు ఎంత అందంగా ఉన్నారో.. ఇప్పుడూ అదే గ్రేస్‌తో అంతే అందంగా ఉన్నారు. పైగా అప్పట్నుంచి ఇప్పటి వరకు హీరోయిన్‌గా కొనసాగడం చాలా గొప్ప విషయం. ఇప్పుడు తమన్నా ప్రతి రోజూ వార్తల్లోని వ్యక్తే! నటుడు విజయ్ వర్మ(Vijay varma)- తమన్నా ప్రేమ కథలు హాట్ టాపిక్‌గా మారాయి. తమ ప్రేమను వీరిద్దరు రహస్యంగా ఏమీ ఉండలేదు. తాము ప్రేమలో ఉన్నామని వారే స్వయంగా చెప్పారు. ప్రస్తుతం వారిద్దరు గాఢ ప్రేమలో మునిగి తేలుతున్నారు.
హీరోయిన్ తమన్నా భాటియా(tamannaah Bhatia) ఓ పక్క సినిమాలు, మరో పక్క వెబ్ సిరీస్‌లతో చాలా బిజీగా ఉన్నారు. సినిమా పరిశ్రమలో అడుగుపెట్టినప్పుడు ఎంత అందంగా ఉన్నారో.. ఇప్పుడూ అదే గ్రేస్‌తో అంతే అందంగా ఉన్నారు. పైగా అప్పట్నుంచి ఇప్పటి వరకు హీరోయిన్‌గా కొనసాగడం చాలా గొప్ప విషయం. ఇప్పుడు తమన్నా ప్రతి రోజూ వార్తల్లోని వ్యక్తే! నటుడు విజయ్ వర్మ(Vijay varma)- తమన్నా ప్రేమ కథలు హాట్ టాపిక్‌గా మారాయి. తమ ప్రేమను వీరిద్దరు రహస్యంగా ఏమీ ఉండలేదు. తాము ప్రేమలో ఉన్నామని వారే స్వయంగా చెప్పారు. ప్రస్తుతం వారిద్దరు గాఢ ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఇప్పటి వరకు పలు ఇంటర్వ్యూలో తమ ప్రేమ గురించి చెబుతూనే వున్నారు. తాజాగా విజయ్ వర్మ మరోసారి ఈ విషయంపై మాట్లాడారు. ‘మా ప్రేమ కథ గురించి, మా గురించి తెలుసుకోవడానికి అందరూ ఎంతో ఆసక్తిగా వున్నారు. అందరి ఆదరణ, అభినందనలు పొందిన జంటల్లో మేము కూడా వున్నామనేది నాకు ఇప్పటి వరకు తెలియదు. అంత మంది ఆదరణ సొంతం చేసుకున్నందుకు సంతోషంగా వుంది. మేమిద్దరం ప్రేమలో పడిన కొత్తలో బయటికి వెళ్లినప్పుడు అందరి దృష్టి మా మీద పడటం, వ్యక్తిగత జీవితం అందరిలో డిస్కషన్ పాయింట్‌గా వుండటం అసౌకర్యంగా ఫీలయ్యాను. రాను రాను నేను కూడా దానికి అలవాటుపడ్డాను. ఏది ఏమైనా తమన్నాతో నేను పీకల్లోతు ప్రేమలో మాత్రం వున్నాను’ అని విజయ్‌వర్మ అన్నారు. ‘విజయ్ తన జీవితంలో ఎంతో స్పెషల్ పర్సన్ అని, నాకు కష్టం వస్తే నాతోనే వుంటాడనే నమ్మకం వుంది' అని తమన్నా ఇప్పటికే చాలాసార్లు చెప్పారు.