తమిళ స్టార్ హీరో దళపతి విజయ్(Thalapthy Vijay) కోసం నిర్మాతలు క్యూలో ఉంటారు. రెమ్యునరేషన్ ఎంతైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం లియో(Leo) అన్న సినిమాలో నటిస్తున్నాడు. లోకేష్ కనకరాజ్(Lokesh Kanakaraju) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిస్తున్నారు.

Thalapathy Vijay
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్(Thalapthy Vijay) కోసం నిర్మాతలు క్యూలో ఉంటారు. రెమ్యునరేషన్ ఎంతైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం లియో(Leo) అన్న సినిమాలో నటిస్తున్నాడు. లోకేష్ కనకరాజ్(Lokesh Kanakaraju) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిస్తున్నారు. ఇందులో విజయ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా తర్వాత విజయ్ నటించబోయే చిత్రమేమిటన్న దానిపై నిన్నమొన్నటి వరకు ఉత్కంఠ ఉండింది. ఇప్పుడు కొత్త చిత్రంపై స్పష్టత వచ్చింది. విజయ్ తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.
దళపతి 68(Thalapathy 68) వర్కింగ్ టైటిల్‌తో ఏజీఎస్(AGS Entertainment) ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించనుంది. దీనికి వెంకట్ ప్రభు(Venkatesh prabhu) దర్శకత్వం వహిస్తున్నాడు. యువన్‌శంకర్ రాజా(Yuvan shankar Raja) సంగీతాన్ని అందించబోతున్నారు. ఆగస్ట్‌లో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది. వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. .ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. వెంకట్‌ప్రభు దర్శకత్వం వహించిన కస్టడీ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే!
