తమిళ హీరో శివకార్తికేయన్‌(shiva karthikeyan), అదితి శంకర్‌(Aditi Shankar) జంటగా నటించిన మా వీరన్‌(Ma Veeran) మొన్ననే విడుదలయ్యింది. తెలుగులో మహావీరుడు(Mahaveerudu) పేరుతో రిలీజ్‌ చేశారు. మడోన్‌ అశ్విన్‌(Madon Ashwin) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దర్శకుడు మిస్కిన్‌(Miskin), టాలీవుడ్‌ నటుడు సునీల్(Sunil) విలన్‌లుగా నటించారు.

తమిళ హీరో శివకార్తికేయన్‌(shiva karthikeyan), అదితి శంకర్‌(Aditi Shankar) జంటగా నటించిన మా వీరన్‌(Ma Veeran) మొన్ననే విడుదలయ్యింది. తెలుగులో మహావీరుడు(Mahaveerudu) పేరుతో రిలీజ్‌ చేశారు. మడోన్‌ అశ్విన్‌(Madon Ashwin) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దర్శకుడు మిస్కిన్‌(Miskin), టాలీవుడ్‌ నటుడు సునీల్(Sunil) విలన్‌లుగా నటించారు. చాలా సంవత్సరాల తర్వాత సరిత(Saritha) ఇందులో ముఖ్య పాత్ర పోషించారు. తల్లి పాత్రలో ఆమె జీవించారనే చెప్పాలి. అరుణ్‌ విశ్వ భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమాను ఉదయనిధి స్టాలిన్‌కు(Udayanidhi Stalin) చెందిన రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థ విడుదల చేసింది.

ఈ సినిమాను మొదటి రోజు మొదటి షోను చూడటానికి స్టార్‌ హీరో దళపతి విజయ్‌(Thalapathy Vijay) భార్య సంగీత(sangitha) థియేటర్‌కు రావడం విశేషం. ఇటీవల విజయ్‌- సంగీత దంపతులపై అనేక రకాల వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో వీరి గురించి ఇష్టం వచ్చినట్టుగా రాశారు. ముఖ్యంగా విజయ్‌ నిర్వహించిన ఏ కార్యక్రమానికి సంగీత హాజరుకాలేదు. విజయ్‌ విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించిన కార్యక్రమంలో కూడా సంగీత కనిపించలేదు. ఆమె తన బిడ్డల సంరక్షణ బాధ్యతలను చూసుకునేందుకు విదేశాలకు వెళ్లినట్టు ప్రచారం జరిగింది. అలాంటిది ఒక్కసారిగా శుక్రవారం సంగీత మొహానికి ముసుగేసుకుని శివకార్తికేయన్‌ నటించిన మావీరన్‌ చిత్రం చూసేందుకు చెన్నైలోని ఓ థియేటర్‌కు రావడం హాట్‌టాపిక్‌గా మారింది.

ఆమె ఈ సినిమాకు రావడంతో అదనపు పబ్లిసిటీ వచ్చింది. ఆల్‌రెడీ సినిమాకు పాజిటివ్‌ టాకే వచ్చింది. ఆమె థియేటర్‌కు రావడంతో విజయ్‌ అభిమానులు సంబరపడుతున్నారు. విజయ్‌- సంగీత దంపతులపై వస్తున్న వదంతులకు ఇక బ్రేక్ పడుతుందని ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు. కాగా విజయ్‌ నటిస్తున్న లియో(Leo) సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం త్వరలోనే జరగనుంది. ఈ వేడుకల్లో సంగీత కచ్చితంగా పాల్గొంటారనే గట్టి నమ్మకంతో అభిమానులు ఉన్నారు. ఇదిలా ఉంటే ఓ వైపు విజయ్ అభిమానులు మావీరన్‌పై నెగిటివ్ రివ్యూలు ఇస్తూనే.. మరోవైపు శివకార్తికేయన్‌కు అనుకూలంగా కామెంట్లు చేస్తున్నారు. థియేటర్‌లో శివకార్తికేయన్ భార్య ఆర్తితో(Arthi) కలిసి ఆమె చేయి పట్టుకుని చాలా సంతోషంగా మాట్లాడారు సంగీత.

Updated On 15 July 2023 1:12 AM GMT
Ehatv

Ehatv

Next Story