కోలీవుడ్‌ టాప్‌ హీరో దళపతి విజయ్‌ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఇటీవలే లియో చిత్రాన్ని పూర్తి చేసి విశ్రాంతి కోసం లండన్‌కు వెళ్లారు. లియో చిత్రం పోస్ట్ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంఓటంది. లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబరులో విడుదల కాబోతున్నది.

కోలీవుడ్‌ టాప్‌ హీరో దళపతి విజయ్‌ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఇటీవలే లియో చిత్రాన్ని పూర్తి చేసి విశ్రాంతి కోసం లండన్‌కు వెళ్లారు. లియో చిత్రం పోస్ట్ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంఓటంది. లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబరులో విడుదల కాబోతున్నది. విజయ్‌ తర్వాతి చిత్రానికి వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. విజయ్‌కి ఇది 68వ సినిమా! దీన్ని ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో విజయ్‌ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారు. విజయ్‌కు జంటగా ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. ఇందులో నటి జ్యోతిక ఒకరని ఇంతకు ముందు వార్తలు వచ్చాయి. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల జ్యోతిక ఈ సినిమా నుంచి తప్పుకున్నారట! ఆమె ప్లేస్‌లో ఇప్పుడు నటి సిమ్రాన్‌ను ఎంపిక చేశారట! ఈ సినిమాకు యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నాడు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తండ్రీ కొడుకులుగా నటించనున్న విజయ్‌ గెటప్‌ రూపకల్పనలో దర్శక నిర్మాతలు ఉన్నారు. ప్రస్తుతం విజయ్‌ న్యూయార్క్‌లో ఉన్నారు. ఆయనతో పాటు చిత్ర నిర్వాహకురాలు అర్చన, దర్శకుడు వెంకట్‌ ప్రభు కూడా అక్కడే ఉన్నట్టు సమాచారం. విజయ్‌ న్యూయార్క్‌ విమానాశ్రయంలో ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇదిలా ఉంటే విజయ్‌ త్వరలో రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్నారని వార్తలు వచ్చాయి. ఆయన ఒక న్యూస్‌ ఛానల్‌ను కూడా ప్రారంభించబోతున్నారట!

Updated On 31 Aug 2023 11:40 PM GMT
Ehatv

Ehatv

Next Story