సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన భారీ యాక్షన్‌ చిత్రం వెట్టైయాన్‌ ఇవాళ విడుదలయ్యింది.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన భారీ యాక్షన్‌ చిత్రం వెట్టైయాన్‌ ఇవాళ విడుదలయ్యింది. అబౌ యావరేజ్‌ టాక్ తెచ్చుకుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై వచ్చిన ఈ సినిమాకు టీజీ జ్ఞానవేల్‌ దర్శకత్వం వహించాడు. జైలర్‌ తర్వాత రజనీకాంత్‌ నటించిన లాల్‌ సలామ్‌ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దాంతో అభిమానులు వెట్టైయాన్‌పై ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో అమితాబ్‌బచ్చన్‌, రానా దగ్గుబాటి కీలక పాత్రలు పోషించారు. రజనీ సినిమాను మొదటి రోజు మొదటి ఆటను చూడాలనే ఆత్రుత చాలా మందికి ఉంటుంది. అలాంటివారిలో ఓ స్టార్‌ హీరో కూడా ఉండటం విశేషం. ఇటీవల ది గోట్‌ సినిమాతో అభిమానులను మెప్పించిన విజయ్‌ కూడా రజనీకి పెద్ద ఫ్యాన్‌. ఆ అభిమానంతో వెట్టైయాన్‌ మొదటి షోను చూశారు. ఆయనతో పాటు ది గోట్ డైరెక్టర్ వెంకట్ ప్రభు కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది

Eha Tv

Eha Tv

Next Story