ఎన్నాళ్ళీ ముసుగులో గుద్దులాట.. డైరెక్ట్ పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు.. తమిళ స్టార్ హీరో విజయ్(Vijay). ఇప్పుడిప్పుడు పొలిటికల్ గా ఓపెన్ అవుతున్నాడు. త్వరలో ఓ భారీ అప్ డేట్ తమిళ రాజకీయాలను కుదిపేయ బోతుందట..?

ఎన్నాళ్ళీ ముసుగులో గుద్దులాట.. డైరెక్ట్ పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు.. తమిళ స్టార్ హీరో విజయ్(Vijay). ఇప్పుడిప్పుడు పొలిటికల్ గా ఓపెన్ అవుతున్నాడు. త్వరలో ఓ భారీ అప్ డేట్ తమిళ రాజకీయాలను కుదిపేయ బోతుందట..?

తమిళ స్టార్ హీరో.. దళపతి విజయ్(Thalapathy Vijay) పొలిటికల్ ఎంట్రీకి(political Entry) రెడీ అవుతున్నాడు. ఇన్నాళ్లు.. విజయ్ రాజకీయాల ఆరంగేట్రం వార్తలు రూమర్స్ గానే మిగిలిపోగా.. అవి ప్రస్తుతం ఒక్కొక్కటిగా నిజం అవుతున్నాయి. అంతే కాదు.. విజయ్ సినిమాలకు 3 ఏళ్లు బ్రేక్ ఇచ్చి.. తమిళ రాజకీయాల్లో సంచలన నిర్ణయానికి పూనుకుంటున్నట్టు తెలుస్తోంది. విజయ్ పాదయాత్ర(Padayatra) చేయబోతున్నట్టు సమాచారం. విజయ్ రాజకీయరంగ ప్రవేశానికి సంబంధించిన విషయం ఆ రాష్ట్రంలో ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. తాజాగా విజయ్ కు సంబంధించిన ఒక వార్త ప్రకంపనలు పుట్టిస్తోంది. త్వరలోనే ఆయన పాదయాత్ర చేయబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతోంది.

విజయ్ తన అభిమాన సంఘం 'విజయ్ మక్కల్ ఇయక్కం'(Vijay Makkal Iyakkam) సభ్యులతో తరచుగా సమావేశమవుతుంటారు.రీసెంట్ గా కూడా ఈ సంఘం సభ్యులతో మీటింట్ పెట్టాడు విజయ్. ఈసమావేశంలోనే పాదయాత్రకుసంబంధించిన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలో రిలీజ్ కాబోతున్న లియో(LEO) మూవీ తరువాత విజయ్ మరో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో విజయ్ పొలిటికల్ ఎంట్రీకి కావల్సిన మసాలా ఆడ్ చేయబోతున్నట్టు తెలస్తోంది. అదిలీడ్ తీసుకుని.. దాదాపు మూడేళ్లు.. అంటే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేవరకూ తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది.

ఈ చిత్రం అక్టోబర్ 19న విడుదల కానుంది. ఈ లోగానే తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. మరోవైపు ఇటీవలే విజయ్ రాష్ట్రంలోని నియోజకవర్గాల వారీగా టెన్త్, ఇంటర్ పరీక్షల్లో ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులను సన్మానించారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో మెరిట్ విద్యార్థులకు సర్టిఫికెట్స్, నగదు ప్రోత్సాహాన్ని అందించారు. ఇదంతా కూడా రాజకీయ అరంగేట్రంలో భాగమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Updated On 12 July 2023 6:50 AM GMT
Ehatv

Ehatv

Next Story