తమిళ అగ్రహీరో విజయ్‌(Thalapathy Vijay) నటించిన లియో సినిమా(Leo Moveie) అక్టోబర్‌ 19న విడుదలయ్యింది. లోకేశ్‌ కనకరాజ్‌(Lokesh Kanagaraj) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష(Trisha) హీరోయిన్‌గా నటించింది. మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమాకు కలెక్షన్లు మాత్రం విపరీతంగా వచ్చాయి. ఇప్పటికే 500 కోట్ల రూపాయల మార్కును దాటేసింది.

తమిళ అగ్రహీరో విజయ్‌(Thalapathy Vijay) నటించిన లియో సినిమా(Leo Moveie) అక్టోబర్‌ 19న విడుదలయ్యింది. లోకేశ్‌ కనకరాజ్‌(Lokesh Kanagaraj) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష(Trisha) హీరోయిన్‌గా నటించింది. మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమాకు కలెక్షన్లు మాత్రం విపరీతంగా వచ్చాయి. ఇప్పటికే 500 కోట్ల రూపాయల మార్కును దాటేసింది. LCU లో భాగంగా ఖైదీ, విక్రమ్ లాంటి సినిమాలు బ్లాక్‌బస్టర్‌ కొట్టాయి. లియో కూడా తమిళంలో బాగా హిట్టయ్యింది. తెలుగు ప్రేక్షకులకు మాత్రం అంతగా నచ్చలేదనే చెప్పాలి. లియో సినిమాకు సెన్సార్‌ బోర్డు దాదాపు 15కు పైగా కట్స్‌ ఇచ్చింది. సినిమాకు U/A సర్టిఫికెట్‌ ఇచ్చింది. అయితే సెన్సార్‌ వారు కట్‌ చేసిన సన్నివేశాలు ఉండి ఉంటే సినిమా మరో లెవల్లో ఉండేదని విజయ్‌ ఫాన్స్‌ అనుకుంటున్నారు. పైగా ఈ సీన్లను యాడ్‌ చేయమంటూ లియో మేకర్స్‌ను కోరుతూనే ఉన్నారు. దీంతో లియో మేకర్స్‌ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అభిమానులు కోరుకున్నట్టుగానే నవంబర్‌ 3వ తేదీ నుంచి జీరో కట్స్‌తో లియో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు ప్రకటించారు. అయితే వీక్షకులకు ఓ కండిషన్‌ పెట్టారు. 18 ఏళ్ల పూర్తిగా నిండిన వారు మాత్రమే సినిమా చూడాలని ప్రకటించారు. దీనికి ప్రధాన కారణం ఎక్కువగా రక్తపాతం ఉన్న సీన్లు మళ్లీ ఈ సినిమాలో చేర్చుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా జంతు, నరబలులు లాంటి సీన్లు సినిమాలో ఉన్నాయట! వాటిని మొదట సెన్సార్‌ వారు అంగీకరించలేదు. ప్రస్తుతం వాటిని ప్రసారం చేయాలంటే A సర్టిఫికెట్‌ తప్పనిసరి అయింది. ఇప్పుడు ఎలాంటి కట్స్‌ లేకుండా నవంబర్‌ 3వ తేదీ నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది లియో.

Updated On 1 Nov 2023 2:02 AM GMT
Ehatv

Ehatv

Next Story