తమిళ చిత్ర సీమ నుంచి.. అందులోను.. స్టార్ హీరో విజయ్ నుంచి రాబోతున్న అద్భుతమైన సినిమా..మోస్ట్‌ ఎవెయిటెడ్‌ మూవీ లియో (Leo.. Bloody Sweet). దళపతి విజయ్ (Vijay) యంగ్ డైరెక్టర్ లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోనన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ లియో. వస్తోంది. ఇప్పటికే ఈసినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. దానికి తోడు మేకర్స్ లాంఛ్ చేసిన లియో ఫస్ట్ లుక్, టైటిల్‌ ప్రోమో గ్లింప్స్ వీడియో, నా రెడీ సాంగ్‌ నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నాయి.

తమిళ స్టార్ హీరో విజయ్(Vijay thalapathy) కోసం గట్టి ప్లానే వేశాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్(Lokesh kanakaraj). లియో(Leo) సినిమాను కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాడట.

తమిళ చిత్ర సీమ నుంచి.. అందులోను.. స్టార్ హీరో విజయ్ నుంచి రాబోతున్న అద్భుతమైన సినిమా..మోస్ట్‌ ఎవెయిటెడ్‌ మూవీ లియో (Leo.. Bloody Sweet). దళపతి విజయ్ (Vijay) యంగ్ డైరెక్టర్ లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోనన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ లియో. వస్తోంది. ఇప్పటికే ఈసినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. దానికి తోడు మేకర్స్ లాంఛ్ చేసిన లియో ఫస్ట్ లుక్, టైటిల్‌ ప్రోమో గ్లింప్స్ వీడియో, నా రెడీ సాంగ్‌ నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నాయి.

ఈక్రమంలోనే దళపతి విజయ్‌, అనిరుధ్‌ రవిచందర్(Anirudh ravichandar) కలిసి పాడిన నా రెడీ సాంగ్‌ నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ కూడా గట్టిగానే రాబడుతోంది. ఇక ఈమూవీ అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా విజయ్ ఫ్యాన్స్ ను అలరించడానికి రెడీ అవుతున్న క్రమంలో.. ఈమూవీ గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. లియోకు సంబంధించిన క్రేజీ గాసిప్‌ ఒకటి ఇండస్ట్రీలో సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది. లోకేశ్‌ కనగరాజ్‌ లియోను రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నాడన్న వార్త ఇండస్ట్రీలో గట్టిగా వినిస్తోంది.

లేటెస్ట్‌ టాక్‌ ప్రకారం లియో ఫస్ట్ పార్టు ముగింపులో పార్టు 2 టీజర్‌ ఉండబోతుందట. లియో సీక్వెల్‌ను 2025-26 మధ్యకాలంలో విడుదల చేసే అవకాశాలున్నాయని టాక్‌.ఖైదీ 2, విక్రమ్‌ 2 సీక్వెల్‌ వార్తలు కూడా ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తున్నాయని తెలిసిందే. మరి లోకేశ్ కనగరాజ్‌ ఈ క్రేజీ సీక్వెల్స్‌ను వన్‌ బై వన్‌ ఎలా ట్రాక్‌పైకి తీసుకొస్తాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. మరి ఈ గాసిప్ లో నిజం ఎంత.. అనేది తెలియాలంటే అఫీషియల్ గా ఎవరో ఒకరు అనౌన్స్ చేయాలి..

బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌, యాక్షన్‌ కింగ్ అర్జున్‌, ప్రియా ఆనంద్‌, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్‌, గౌతమ్ వాసు దేవ్‌మీనన్‌, మిస్కిన్‌, మాథ్యూ థామస్‌, సాండీ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ... . యాక్షన్‌ జోనర్‌లో తెరకెక్కుతుంది. లియో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది

Updated On 9 Aug 2023 12:05 AM GMT
Ehatv

Ehatv

Next Story