టాలీవుడ్‌ హీరో విజయ్‌(Vijay thalapthy) ఫ్యాన్స్‌ మామూలోళ్లు కాదు. వారికి ఆనందం వస్తే పట్టపగ్గాలుండవు. లాస్టియర్‌ విజయ్‌ నటించిన లియో(Leo) సినిమా సూపర్‌ డూపర్‌ హిట్టయ్యింది. ప్రస్తుతం అతను ద గోట్‌(The GOAT) (గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్ టైమ్‌) అనే సినిమాలో నటిస్తున్నాడు.

కోలివుడ్ హీరో విజయ్‌(Vijay thalapthy) ఫ్యాన్స్‌ మామూలోళ్లు కాదు. వారికి ఆనందం వస్తే పట్టపగ్గాలుండవు. లాస్టియర్‌ విజయ్‌ నటించిన లియో(Leo) సినిమా సూపర్‌ డూపర్‌ హిట్టయ్యింది. ప్రస్తుతం అతను ద గోట్‌(The GOAT) (గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్ టైమ్‌) అనే సినిమాలో నటిస్తున్నాడు. టైమ్‌ ట్రావెల్ కాన్సెప్ట్‌ కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. షూటింగ్‌ కోసమని సినిమా యూనిట్‌ కేరళకు(Kerala) వెళ్లింది. వారం రోజుల పాటు అక్కడే షూటింగ్‌ జరుగుతుంది. 14 ఏళ్ల తర్వాత తమ అభిమాన నటుడు కేరళకు వస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అక్కడి ఆయన ఫ్యాన్స్‌ ఒక్క చోటకు వచ్చారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. విజయ్‌ వస్తున్నాడని తెలిసి వందలాది మంది అభిమానులు ఎయిర్‌పోర్ట్‌ దగ్గరకు చేరుకున్నారు. అక్కడి నుంచి విజయ్‌ కారులో ప్రయాణిస్తున్నప్పుడు తోపులాట ఎక్కువయ్యింది. దాంతో కారు డ్రైవర్‌ దగ్గర ఉన్న అద్దం పలిగిపోయింది. కారుకు చాలా చోట్ల సొట్టలు పడ్డాయి. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఆ కారుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Updated On 19 March 2024 11:31 PM GMT
Ehatv

Ehatv

Next Story