స్టార్‌ హీరోలతో సినిమా తీయడమంటే మామూలు విషయం కాదు.. హీనపక్షం ఓ మూడొందల కోట్లు ఉంటే కానీ నిర్మించడం సాధ్యం కాదు. ఎందుకంటే హీరోకే వంద కోట్లకు పైగా పారితోషికాన్ని(reward) సమర్పించుకోవాల్సి వస్తోంది. ఆ మేరకు బాక్సాఫీసు దగ్గర కోట్లు కూడా రాబడుతున్నాయనుకోండి.. అందుకే ప్రేక్షకుల్లో ఉన్న భారీ క్రేజ్ క్యాష్‌ చేసుకుంటూ సినిమా సినిమాకు రెమ్యూనిరేషన్‌ను(Remuneration) పెంచుతూ పోతున్నారు హీరోలు.

బాలీవుడ్‌లోనూ(Bollywood), సౌత్‌ ఇండియాలోనూ(South india) సినిమాకు వంద కోట్లు తీసుకునే టాప్‌స్టార్లు చాలా మంది ఉన్నారు. బాలీవుడ్‌ బిగ్‌స్టార్ల కంటే ఎక్కువ రెమ్యూనిరేషన్‌ను తీసుకుంటున్న నటుడు ఎవరో తెలుసా? షారూక్‌ఖాన్‌(Shah Rukh Khan), సల్మాన్‌ఖాన్‌(salman Khan), అక్షయ్‌కుమార్‌(Akshay Kumar), ప్రభాస్‌(Prabhas), అల్లు అర్జున్‌(Allu Arjun), రామ్‌చరణ్‌(Ram charan), జూనియర్‌ ఎన్టీఆర్‌లును(Jr.NTR) వెనక్కి నెట్టేసి సినిమాకు రెండు వందల కోట్లు వసూలు చేస్తున్న తొలి భారతీయ నటుడిగా ఓ కోలీవుడ్‌ స్టార్‌ రికార్డు క్రియేట్‌ చేశారిప్పుడు. ఆయనెవరో కాదు..

తమిళ సూపర్‌స్టార్‌ విజయ్‌ దళపతి(Vijay thalapathy). ఇప్పుడు ఇండియాలోనే అత్యధిక పారితోషికాన్ని తీసుకుంటున్న హీరో.. ప్రస్తుతం ఆయన నటిస్తున్న లియో(LEO) సినిమాకు 200 కోట్ల రూపాయలు వసూలు చేశారట. దీనిపై ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు కానీ హైయ్యస్ట్‌ పెయిడ్‌ హీరో విజయ్‌ అని మాత్రం ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. 2021లో వచ్చిన మాస్టర్‌(Master) సినిమాకు విజయ్‌ 80 కోట్ల రూపాయలను పారితోషికంగా తీసుకున్నాడట. బీస్ట్‌(Beast), వారసుడు(Varasudu) సినిమాలకు వంద కోట్లు వసూలు చేశారట. ఇప్పుడు ఆ రెమ్యునిరేషన్‌ను డబుల్‌ చేశారు.

మొన్నే 49వ పుట్టిన రోజును గ్రాండ్‌గా జరుపుకున్న విజయ్‌ 27 ఏళ్ల కిందట హీరోగా పరిచయం అయ్యారు. సుమారు 66 చిత్రాలలో ప్రధాన పాత్రల్లో నటించాడు. ఆయనను కుటుంబసభ్యులు, సన్నిహితులు ప్రేమగా జో అని పిలుచుకుంటారు. ప్రస్తుతం ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్నలియో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. గ్యాంగ్‌స్టర్‌-థ్రిల్లర్‌గా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్‌కు జోడిగా త్రిష నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ప్రియా ఆనంద్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌, మిస్కిన్‌, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు.

Updated On 24 Jun 2023 4:57 AM GMT
Ehatv

Ehatv

Next Story