పుదుకోటైకు చెందిన వెంకటేశ్ అనే అభిమాని తన ప్రేమిస్తున్న మంజుల అనే ప్రేయసితో లియో సినిమా ఆడుతున్న థియేటర్‌కు వచ్చాడు. థియేటర్‌లోనే నిశ్చితార్థం జరుపుకున్నాడు. తనకు తల్లిదండ్రులు ఎవరూ లేరని, విజయ్‌నే తనకు అంతా అని చెబుతున్న వెంకటేశ్ అందుకే ఈ రోజున తాను ఎంగేజ్‌మెంట్‌ను జరుపుకున్నానని తెలిపాడు.

leo
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy vijay)సినిమా విడుదలయ్యింటే చాలు ఫ్యాన్స్‌కు పెద్ద పండుగ! అసలు విజయ్ క్రేజ్ మామూలుగా ఉండదు. గురువారం ఆయన నటించిన సినిమా లియో(leo) విడుదలయ్యింది. త్రిష(Trisha) ఇందులో హీరోయిన్. లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj)దర్శకత్వం వహించాడు. ప్రియా ఆనంద్(Priya Anand), మడోనా సెబాస్టియన్(Madonna Sebastian), బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్(Sanjay Dutt), అర్జున్(arjun), గౌతమ్‌మీనన్(Gautam Menon), మిష్కిన్(Mysskin)ముఖ్యపాత్రలు పోషించారు. లియో సినిమా ఆడుతున్న థియేటర్ల దగ్గర విజయ్ ఫ్యాన్స్ నానా హడావుడి చేశారు. విజయ్ కటౌట్లకు పాలాభిషేకాలు చేశారు. డ్యాన్సలు చేశారు. బాణాసంచా కాల్చారు. కేకులు కట్ చేశారు. స్వీట్లు పంచుకున్నారు. ఇక లియో సినిమా రిలీజ్ రోజున మరో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. పుదుకోటైకు చెందిన వెంకటేశ్ అనే అభిమాని తన ప్రేమిస్తున్న మంజుల అనే ప్రేయసితో లియో సినిమా ఆడుతున్న థియేటర్‌కు వచ్చాడు. థియేటర్‌లోనే నిశ్చితార్థం జరుపుకున్నాడు. తనకు తల్లిదండ్రులు ఎవరూ లేరని, విజయ్‌నే తనకు అంతా అని చెబుతున్న వెంకటేశ్ అందుకే ఈ రోజున తాను ఎంగేజ్‌మెంట్‌ను జరుపుకున్నానని తెలిపాడు. క్రిష్టగిరి(Krishnagiri)కి చెందిన ఓ వీరాభిమాని తన కాలు విరగొట్టుకున్నాడు. టికెట్ సంపాదించుకోవాలనే తపనతో గోడపై నుంచి క్యూలోకి దూకడంతో కాలుకు తీవ్ర గాయమయ్యింది. గాయంతోనే అతను థియేటర్లోకి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకొని అతడిని హాస్పిటల్‌లో చేర్చారు. పుదుకోట్టైలో లియో చిత్రం చూసే ముందు ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాల మధ్య యుద్ధం ఆగిపోవాలని ఆకాంక్షిస్తూ విజయ్ అభిమానులు కొంచెం సేపు మౌనం పాటించారు.
