తమిళ నటుడు(Tamil Nadu) విజయ్(Vijay) పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అత్యధిక పారితోషికాన్ని తీసుకుంటున్న విజయ్ కాల్షిట్ల కోసం నిర్మాతలు క్యూలు కడుతుంటారు. విజయ్ అడినంత మొత్తాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ప్రొడ్యుసర్లు. విజయ్ నటిస్తే చాలు సినిమా హిట్టయినా కాకపోయినా డబ్బులు తిరిగి వచ్చేస్తాయన్న ధీమా!

Thalapathy Vijay
తమిళ నటుడు(Tamil Nadu) విజయ్(Vijay) పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అత్యధిక పారితోషికాన్ని తీసుకుంటున్న విజయ్ కాల్షిట్ల కోసం నిర్మాతలు క్యూలు కడుతుంటారు. విజయ్ అడినంత మొత్తాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ప్రొడ్యుసర్లు. విజయ్ నటిస్తే చాలు సినిమా హిట్టయినా కాకపోయినా డబ్బులు తిరిగి వచ్చేస్తాయన్న ధీమా! ప్రస్తుతం ఆయన లియో(LEO) సినిమాలో నటిస్తున్నారు. లోకేష్ కనకరాజ్(Lokesh kanakaraj) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో త్రిష(Trisha) హీరోయన్‌గా నటిస్తోంది. సినిమా షూటింగ్ ఆఖరి దశలో ఉంది. దాంతో విజయ్ తర్వాత చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
విజయ్ ఇటీవల వారసుడు(Varasudu) చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు డైరెక్ట్‌గా పరిచయమయ్యాడు. ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. విజయ్‌తో సినిమా చేయడానికి దర్శకుడు అట్లీతో(Atlee) పాటు, టాలీవుడ్ దర్శకుడు గోపిచంద్ మలినేని రెడీగా(gopi chand malineni) ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ లిస్టులోకి ఇప్పుడు దర్శకుడు వెంకట్ ప్రభు(Venkatesh prabhu) కూడా చేరారు. ఈ మధ్యనే నాగచైతన్య(Naga Chaithanya) హీరోగా కస్టడీ అనే సినిమా తీసిన సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్‌గుడ్ ఫిల్మ్ సంస్థ నిర్మించనున్న వందవ సినిమాలో నటించడానికి విజయ్ ఒప్పుకున్నాడు. ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తాడా? లేక వెంకట్ ప్రభు దర్శకత్వం చేపడతారా అన్నదానిపై త్వరలో స్పష్టత వస్తుంది.
