కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌(Vijay thalapthy) భవిష్యత్తులో పాలిటిక్స్‌లోకి(Politics) రావడం పక్కా! లియో విజయోత్సవ వేడుకల్లో(LEO Success Meet) ఆయన మాట్లాడిన తీరే అందుకు నిదర్శనం. లోకేశ్‌ కనకరాజ్‌(Lokesh Kanakaraj) డైరెక్షన్‌లో ఇటీవల వచ్చిన విజయ్‌ లేటెస్ట్ మూవీ లియో సూపర్‌హిట్టయ్యింది.

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌(Vijay thalapthy) భవిష్యత్తులో పాలిటిక్స్‌లోకి(Politics) రావడం పక్కా! లియో విజయోత్సవ వేడుకల్లో(LEO Success Meet) ఆయన మాట్లాడిన తీరే అందుకు నిదర్శనం. లోకేశ్‌ కనకరాజ్‌(Lokesh Kanakaraj) డైరెక్షన్‌లో ఇటీవల వచ్చిన విజయ్‌ లేటెస్ట్ మూవీ లియో సూపర్‌హిట్టయ్యింది. చెన్నైలోని నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో(Nehru Indoor Stadium) జరిగిన ఈ వేడుకకు తమిళనాడు నలుమూలల నుంచి విజయ్‌ అభిమానులు హాజరయ్యారు. తన అభిమానులను ఉద్దేశించి విజయ్‌ మాట్లాడుతూ 'దయచేసి ఓపిక పట్టండి. మన లక్ష్యం ఇది కాదు. వేరే ఉంది. అది గొప్పది. ఆ దిశగా అడుగులేద్దాం. భవిష్యత్తులో మనమేంటో చూపిద్దాం’ అని అన్నారు. ‘నాపై ఇంత అభిమానం ఉంచుకున్న మీకు ఏదైనా తప్పకుండా చేయాలనుంది.

చేస్తాను. మీ కాలు చెప్పులా ఉండటానికి కూడా వెనుకాడను. ఇప్పుడేం జరిగినా పట్టించుకోకండా అందరూ ఓపిక పట్టండి. విజయాన్ని అందుకోవచ్చు' అని విజయ్‌ అన్నారు. తన ప్రసంగంలో ఓ పిట్టకథ కూడా చెప్పారు. 'ఇద్దరు వేటగాళ్లు అడవిలోకి వెళ్లారు. ఒకడు తన వద్ద ఉన్న బాణంతో కుందేలును గురుచూసి పట్టుకున్నాడు. ఇంకొకడు ఏనుగును లక్ష్యంగా చేసుకుని తన వద్ద ఉన్న ఆయుధాన్ని విసిరాడు. గురితప్పింది. ఉత్త చేతులతో ఇంటికి తిరిగొచ్చారు. నా దృష్టిలో కుందేలును పట్టుకున్న వ్యక్తి విజయం సాధించినట్టు కాదు. ఏనుగులాంటి పెద్ద లక్ష్యాన్ని ఛేదించాలని అనుకున్న వ్యక్తే గొప్పవాడు. అతను ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో విజయాలను పొందుతాడు' అని విజయ్‌ చెప్పరు. విజయ్‌ చేసిన వ్యాఖ్యలు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ను(Rajinikanth) ఉద్దేశించి చేసినవేనని సినీ వర్గాలు అనుకుంటున్నాయి. కొసమెరుపు ఏమిటంటే ఈ కార్యక్రమానికి మీడియాను(Media) అనుమతించకపోవడం...

Updated On 3 Nov 2023 1:51 AM GMT
Ehatv

Ehatv

Next Story