అభిమానికి కోపంగా సమాధానం చెప్పారు తమిళ హీరో విజయ్ సేతుపతి. అయితే ఆ అభిమాని తమిళ్ కాదు తెలుగు.. విజయ ప్రెస్ మీట్ కూడా హైదరాబాద్ లోనే అయ్యింది. ఇంతకీ ఏం జరిగింది.

విజయ్ సేతుపతి హీరోగా ఎంట్రీఇచ్చి.. అన్నిరకాల పాత్రలు చేస్తున్నారు.ముఖ్యంగా కమల్ హాసన్ మాదిరి ప్రయోగాత్మక సినిమాలు బాగా చేసుకుంటూ వెళ్తున్నాడు. తమిళంతో పాటు విజయ్ సినిమాలు తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ సాధిస్తూ వస్తున్నాయి. దాంతో విజయ్ సేతుపతి డైరెక్ట్ తెలుగు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. మెగాస్టార్ సైరాతో పాటు, ఉప్పెన సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు విజయ్. ఈక్రమంలో తమిళంలో ఆయన నటిస్తున్న సినిమాలన్నీ డబ్ అయ్యి తెలుగులోకి వస్తున్నాయి. దాంతో తెలుగులో కూడా విజయ్ సేతుపతికి ఫ్యాన్స్ పెరిగి.. ఇక్కడ కూడా ఆయన సినిమాలకు డిమాండ్ పెరిగిపోయింది. దాంతో విజయ్ సేతుపతి(Vijay Sethupathi)తన ప్రతీ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తూ.. ఇక్కడ కూడా ప్రమోషన్ చేస్తున్నారు. రీసెంట్ గా ఆయన నటించన మహారాజ సినిమాకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే విజయ్ సేతుపతి హీరోగా వస్తున్న మరో సినిమా విడుదల2. ఈసినిమ ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్(Hyderabad) దో ప్రెస్ మీట్ నిర్వహించారు విజయ్. అయితే ఈ ప్రెస్ మీట్ లో ఫ్యాన్స్ రకరకాల ప్రశ్నలు అడిగారు.అందులో ఓ అభిమాని అడిగినప్రరశ్నకు విజయ్ కు కోపం వచ్చింది. ఆ అభిమాని ఏమని అన్నాడంటే.. ఈ సినిమాలో మీరు యూత్ సీన్స్ కోసం యంగ్ గా కనిపించాలని డి-ఏజింగ్ టెక్నాలజీని ఉపయోగించారట.. అందులో నిజమెంత అని అడిగాడు. దాంతో దీనికి విజయ్ కి కోపం వచ్చింది. ఆయన ఫేస్ లో సీరియస్ నెస్ కనిపించింది. వెంటనే ఆయన రెస్పాండ్ అవుతూ..”దానికి అర్థం ఏమిటి.? నా సినిమా చూసి మీకు నచ్చిందో లేదో చెప్పండి అంతే. సినిమాల్లో ఖచ్చితంగా టెక్నాలజీని ఉపయోగించి తీస్తారు. అయితే ఆ విషయాలు ప్రేక్షకులకు ఎందుకు తెలియాలి.? అని విజయ్ అన్నారు.
