బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్‌(Kangana Ranaut) అప్పట్లో దక్షిణాది సినిమాల్లో కూడా కనిపించారు. ఏక్‌నిరంజన్‌(Ek Niranjan) సినిమాలో ప్రభాస్‌ సరసన నటించారు కంగన.. అలాగే తమిళంలో కూడా హీరోయిన్‌గా నటించారు. ఆ తర్వాత హిందీ సినిమాల్లో బిజీ అయ్యారు. దక్షిణాదిలో ఆమెకు తగిన పాత్రలు లభించకపోవడంతో ఇటువైపు ఆమె దృష్టి పెట్టలేదు.

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్‌(Kangana Ranaut) అప్పట్లో దక్షిణాది సినిమాల్లో కూడా కనిపించారు. ఏక్‌నిరంజన్‌(Ek Niranjan) సినిమాలో ప్రభాస్‌ సరసన నటించారు కంగన.. అలాగే తమిళంలో కూడా హీరోయిన్‌గా నటించారు. ఆ తర్వాత హిందీ సినిమాల్లో బిజీ అయ్యారు. దక్షిణాదిలో ఆమెకు తగిన పాత్రలు లభించకపోవడంతో ఇటువైపు ఆమె దృష్టి పెట్టలేదు. ఇప్పుడు మళ్లీ దక్షిణాది సినిమాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకునే కంగన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత(Jayalalitha) జీవిత చరిత్రతో రూపొందించిన తలైవి(Thalaivi) సినిమాలో టైటిల్‌ పాత్రను పోషించారు. ప్రస్తుతం పి.వాసు(P.vasu) దర్శకత్వంలో చంద్రముఖి-2(Chandhramukhi-2) సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తయ్యింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కాబోతున్నది. ఇందులో లారెన్స్‌(Lwarence) హీరోగా నటిస్తున్నారు. ఇప్పుడు మరో తమిళ సినిమాలో నటించడానికి కంగనా రనౌత్‌ సిద్ధం అవుతున్నారు. ట్రైడెంట్‌ ఆర్ట్స్‌(Trident Arts), అహింసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌(Ahimsa Entertainment) సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాలో ఓ తమిళ నటుడు, హిందీ నటి కలిసి నటించబోతున్నట్టు ఇంతకు ముందే నిర్మాతలు తెలిపారు. ఇప్పుడు హీరో హీరోయిన్లను అనౌన్స్‌ చేశారు. ఈ సినిమాలో కథానాయకుడిగా విజయ్‌ సేతుపతి(Vijay sethupathy) నటిస్తున్నారు. కంగనా రనౌత్‌ హీరోయిన్‌ పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాను మలయాళ అగ్ర దర్శకుడు విపిన్‌(Vipin) తెరకెక్కిస్తున్నారు. థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందించనున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు కొద్ది రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. విజయ్‌ సేతుపతి, కంగనా రనౌత్‌ జోడి అనగానే ఈ సినిమాపై అమితమైన ఆసక్తి నెలకొంది.
ఇకపోతే కంగనా రనౌత్‌ స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మిస్తున్న హిందీ చిత్రం ఎమర్జెన్సీ(emergency) నవంబర్‌లో విడుదల కాబోతున్నది.

Updated On 21 July 2023 12:41 AM GMT
Ehatv

Ehatv

Next Story