సెల్యూలాయిడ్‌పై(Celluloid) అజరామరంగా నిలిచిన ప్రేమకథలు ఎన్నో! లవ్‌స్టోరీలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. చక్కగా తీస్తే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ఇందుకు లెక్కలేనన్ని ఉదాహరణలు ఉన్నాయి. అందుకే ప్రేమకథను నమ్ముకున్నాడు విజయ్ దేవరకొండ(Vijay Devarkonda). యాక్షన్ మోడ్ ప్రయత్నించాడు కానీ అది పెద్దగా వర్కవుట్ అవ్వలేదు.
సెల్యూలాయిడ్‌పై(Celluloid) అజరామరంగా నిలిచిన ప్రేమకథలు ఎన్నో! లవ్‌స్టోరీలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. చక్కగా తీస్తే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ఇందుకు లెక్కలేనన్ని ఉదాహరణలు ఉన్నాయి. అందుకే ప్రేమకథను నమ్ముకున్నాడు విజయ్ దేవరకొండ(Vijay Devarkonda). యాక్షన్ మోడ్ ప్రయత్నించాడు కానీ అది పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. అందుకే మళ్లీ లవ్‌ట్రాక్ ఎక్కాడు. మరోవైపు సమంత పరిస్థితి కూడా ఇంచుమించుగా ఇలాగే ఉంది. యాక్షన్ మూవీ చేసింది. సక్సెసవ్వలేదు. పౌరాణికంలో అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది. శాకుంతలం చేసింది. అదీ పెద్దగా ఆడలేదు. దాంతో ఆమె కూడా లవ్ స్టోరీని నమ్ముకుంద.
వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఖుషి(Kushi). ప్రేమకథలను అద్భుతంగా తెరకెక్కించగలడని పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ(shiva Nirvana) దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. బుధవారం ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యింది. బేగంకు కవా చాయ్ అలవాటు అయినట్టు ఫ్యూచర్‌లో నేను కూడా అలవాటైపోతరా?' అని ఊహల్లో తేలిపోతుంటాడు విజయ్. అప్పటివరకు ముస్లింగా కనిపించిన సమంత సడన్‌గా తను బ్రాహ్మణురాలన్న నిజం చెప్తుంది. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించరు. దాంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్టు ట్రైలర్‌లో చూపించారు.
ఇక ఇందులో పెళ్లంటేనే సావురా.. నువ్వెప్పుడో సచ్చిపోయినవ్.. డెడ్ మీట్ రిప్.., భర్త అంటే ఎట్లుండాలో సమాజానికి చూపిస్తా, మార్కెట్లో నా గురించి అట్ల అనుకుంటున్నరు కానీ, నేను స్త్రీ పక్షపాతిని అనే డైలాగులు బాగున్నాయి. 'మన సంప్రదాయాలు, కుటుంబ బంధాలు, వివాహవ్యవస్థ వంటి అంశాలతో ముడిపడిన సినిమా ఇది. ఇలాంటి చిత్రంలో భాగమవడం సంతోషంగా వుంది’ అని చెప్పుకొచ్చారు హీరో విజయ్ దేవరకొండ.
అన్నారు కథానాయకుడు విజయ్ దేవరకొండ.
' నాకు ప్రేమకథలపై ఆసక్తి తగ్గిపోయింది. ఖుషి కథ విన్న తరువాత మళ్లీ ప్రేమకథలో నటించాలని ఆసక్తి కలిగింది. వివాహం అనేది మన జీవితంలో ముఖ్యమైన ఛాప్టర్. త్వరలోనే నేను ఆ ఛాప్టర్‌లోకి అడుగుపెడతా’ అని అన్నాడు. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా సెప్టెంబర్ 1వ తేదీన విడుదల కాబోతున్నది. అబ్దుల్ వాహబ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు.