లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో దళపతి విజయ్, త్రిష జంటగా నటించిన సినిమా.. ప్రపంచవ్యాప్తంగా రూ.600
ఇళయదళపతి విజయ్ హీరోగా నటించిన సినిమా 'లియో'. ఈ సినిమా తమిళనాడులో రికార్డు కలెక్షన్లు సృష్టించింది. డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో దళపతి విజయ్, త్రిష జంటగా నటించిన సినిమా.. ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అయితే ఇటీవలే విజయ్ పొలిటికల్ జర్నీ గురించి ప్రకటన చేశారు. ప్రస్తుతం ఒక సినిమా చేస్తున్న విజయ్.. ఆ తర్వాత సినిమాలు చేయనని చెప్పుకొచ్చారు. దీంతో లియో పార్ట్-2 వచ్చేది డౌట్ అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లియో-2 గురించి లోకేశ్ కనగరాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
లియో పార్ట్ -2 తప్పకుండా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం హీరో విజయ్ ఆశయాలు వేరుగా ఉన్నాయి. ఈ విషయం చాలా సంతోషాన్ని ఇస్తుందన్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అభినందించాలన్నారు. విజయ్ ఒప్పుకుంటే లియో 2 తప్పకుండా వస్తుంది. అందుకు సమయం కూడా అనుకూలిస్తుందని ఆశిస్తున్నానన్నారు. విజయ్ ఫోన్ కోసం ఎదురుచూస్తూ ఉంటానని తెలిపారు. లియో సినిమా విడుదల సమయం నుంచి సెకండాఫ్ పట్ల పలు వమర్శలు వచ్చాయి. అవన్నీ నేను కూడా విన్నాను. రాబోయే సినిమాల్లో ఆ తప్పులు జరగకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటానన్నారు లోకేష్ కనగరాజ్.