సౌత్ ఫిల్మి ఇండస్ట్రీ స్టార్స్ లో దళపతి విజయ్ కూడా ఒకరు. ఆయనకు తమిళనాట మాత్రమే కాదు. తెలుగులో కూడా మంచి మార్కట్ ఉంది. తెలుగులో డైరెక్ట్ సినిమా కూడా చేశారు విజయ్. ఇక సౌత్ ఇండియాఅంతట విజయ్ సినిమాలు బాగా నడుస్తాయి. దాంతో బేసిక్ గా ఆయనకు డిమాండ్ ఎక్కువ. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) డైరెక్షన్ లో లియో(LEO) సినిమా చేస్తున్నాడు విజయ్.

సౌత్ ఇండియా స్టార్ దళపతి విజయ్(Thalapthy) సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసా..? తెలిస్తే కళ్లు తిరిగిపోవాల్సిందే. ప్రస్తుతం వైరల్అవుతున్న న్యూస్ లో నిజం ఎంత...?

సౌత్ ఫిల్మి ఇండస్ట్రీ స్టార్స్ లో దళపతి విజయ్ కూడా ఒకరు. ఆయనకు తమిళనాట మాత్రమే కాదు. తెలుగులో కూడా మంచి మార్కట్ ఉంది. తెలుగులో డైరెక్ట్ సినిమా కూడా చేశారు విజయ్. ఇక సౌత్ ఇండియాఅంతట విజయ్ సినిమాలు బాగా నడుస్తాయి. దాంతో బేసిక్ గా ఆయనకు డిమాండ్ ఎక్కువ. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) డైరెక్షన్ లో లియో(LEO) సినిమా చేస్తున్నాడు విజయ్. ఈసినిమా తరువాత చేయబోయే 68వ సినిమాకు కూడా లైన్ క్లియర్ చేసుకున్నాడు విజయ్. వరుసగా సినిమాలు లైన్ లో పెడుతున్న విజయ్ తన రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచినట్టు తెలుస్తోంది.

తన 68వ సినిమా ను డైరెక్టర్‌ వెంకట్‌ ప్రభు(Venkat Prabhu) కాంబినేషన లో చేస్తున్నాడు విజయ్. అయితే ఈసినిమాను ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ తెరకెక్కిస్తుంది. అయితే ఈసినిమాకోసం విజయ్ ఏకంగా 150 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నాడని ఫిల్మ్ ఇండస్ట్రీలో న్యూస్ వైరల్ అవుతోంది. అంతే కాదు అయితే ఆయన ఈ సినిమా లాభాల్లో షేర్ కూడా అందుకోబోతున్నాడట. మరి ఆ శేర్ తో కలిసి 150 కోట్లా.. లేక రెమ్యూనరేషన్ వేరు.. శేర్ వేరుగా తీసుకుంటున్నాడా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇదే నిజమైతే సౌతిండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్‌ అందుకుంటున్న స్టార్‌గా విజయ్ రికార్డుల్లోకెక్కడం పక్కా అయినట్టే.

ఇండియాలో 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోలలో సూపర్ స్టార్ రజనీకాంత్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఉన్నారు. ఇక వారి లిస్ట్ లో విజయ్ కూడా చేరబోతున్నట్టు తెలుస్తోంది. విజయ్ తో పాటు ఈసారి ఈ గ్రూప్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చేరబోతున్నాడు. ఆయన రెమ్యూనరేఐషన్ కూడా 100 కోట్లు దాటబోతున్నట్టు సమాచారం. ఇక విజయ్ మాత్రం ఈసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా ఉన్నాడు.

ఇండియాతోపాటు విదేశాల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉన్న విజయ్‌ సినిమా అంటే దాదాపు శాటిలైట్‌, డిజిటల్‌ రైట్స్‌ అమ్మకం ద్వారా వచ్చే డబ్బులతో రెమ్యునరేషన్‌ కవర్‌ అవుతుందని ట్రేడ్‌ విశ్లేషకుల అంచనా. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరాది రాష్ట్రాల మార్కెట్‌తో పోలిస్తే రూ.150 కోట్లు ఎక్కువేమి కాదంటున్నారు ట్రేడ్ పండితులు.

Updated On 19 May 2023 12:23 AM GMT
Ehatv

Ehatv

Next Story