‘లైగర్’ సినిమాతో భారీ డిజాస్టర్ ను చవిచూశాడు విజయ్ దేవరకొండ.  ఆ దెబ్బ నుంచి కోలుకోలేక డైరెక్టర్ పూరీతో చేయబోయే ‘జనగణమన’ కూడా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అయితే నెక్ట్స్ మాంచి బ్లాక్ బస్టర్ తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు విజయ్. దీంతో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో ఓ ప్రాజెక్ట్ లైన్ లో పెట్టాడు రౌడీ బాయ్. ప్రస్తుతం ‘VD12’ అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఇక ఈ సినిమాతో విజయ్ దేవరకొండ […]

‘లైగర్’ సినిమాతో భారీ డిజాస్టర్ ను చవిచూశాడు విజయ్ దేవరకొండ. ఆ దెబ్బ నుంచి కోలుకోలేక డైరెక్టర్ పూరీతో చేయబోయే ‘జనగణమన’ కూడా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అయితే నెక్ట్స్ మాంచి బ్లాక్ బస్టర్ తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు విజయ్. దీంతో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో ఓ ప్రాజెక్ట్ లైన్ లో పెట్టాడు రౌడీ బాయ్. ప్రస్తుతం ‘VD12’ అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు.

ఇక ఈ సినిమాతో విజయ్ దేవరకొండ సరసన కన్నడ బ్యూటీ శ్రీలీలను తీసుకొస్తున్నట్టు టాక్స్ వినిపించాయి. ‘పెళ్లి సందD’ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఆమె ‘ధమాకా’ చిత్రంతో ఫుల్ ఫామ్ లోకి ఒచ్చేసింది. ఈ భామ స్టార్ హీరోలతోనూ నటిస్తుంది. మరో వైపు కొన్ని సినిమాల్లో కూతురు పాత్రలు చేస్తూనే ఇటు మెయిన్ క్యారెక్టర్స్ కూడా చేస్తోంది.

ఇదీలా ఉంటే ఇప్పుడు రౌడీ బాయ్ తో రొమాన్స్ చేయనున్నట్టు కన్ ఫామ్ అయింది. తాజాగా VD12 కాస్ట్ అండ్ క్రూ డిటెయిల్స్ బయటికి ఒచ్చాయి. హీరోయిన్ గా శ్రీలీలను తీసుకుంటున్నట్టు మూవీ టీమ్ చెప్పకనే చెప్పేసింది. ఇటు కోలీవుడ్ రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేసేసారు.

ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. ముఖానికి ముసుగు వేసుకున్న ఒక పోలీస్ గా కనిపిస్తున్నాడు విజయ్. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరు బర్త్ డే సందర్భంగా కాస్ట్ అండ్ క్రూ వివరాలు ప్రకటించినట్టు తెలుస్తోంది. ‘VD12’ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ కలిసిన నిర్మిస్తున్న ఈ మూవీని సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు.

శివ నిర్వణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘ఖుషీ’ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉంది. ‘మళ్లీరావా’ ‘జెర్సీ’ లాంటి ఫీల్ గుడ్ చిత్రాలను అందించిన గౌతమ్.. ఈసారి విజయ్ దేవరకొండతో చేయబోయే సినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

Updated On 3 March 2023 4:27 AM GMT
Ehatv

Ehatv

Next Story