అమెరికా(America)లో హడావిడి చేస్తున్నాడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda). లైగర్(Liger) డిజాస్టర్ తరువాత కాస్త మనోడు పబ్లిక్ గా ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ఇవే. ఇదివరకు ఉన్న ఊపును కాస్త తగ్గించి..

అమెరికా(America)లో హడావిడి చేస్తున్నాడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda). లైగర్(Liger) డిజాస్టర్ తరువాత కాస్త మనోడు పబ్లిక్ గా ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ఇవే. ఇదివరకు ఉన్న ఊపును కాస్త తగ్గించి.. రూటు మార్చాడు రౌడీ హీరో.. సినిమాల ఎంపికలో చేంజ్ అయ్యాడు. కాస్త ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ఎంచుకుంటున్నాడు.అలా చేసిన సినిమా ఖుషి. ఈసినిమా బాగా వర్కౌట్ అయ్యింది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఖుషి సినిమాతో సూపర్ సక్సెస్ అందుకొని మళ్లీ ట్రాక్‌పైకి వచ్చాడు.

నిజానికి ప్యామిలీ సబ్జెక్ట్ తో గతంలో వచ్చినవిజయ్ సినిమా గీత గోవిందం ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. దాంతో మరోసారి పరశురాం కు ఛాన్స్ ఇచ్చాడు విజయ్ దేవరకోండ. అతని డైరెక్షన్‌లో ఫ్యామిలీ స్టార్‌లో నటిస్తున్నాడు. VD13 ప్రాజెక్టుగా వస్తోన్న ఈ మూవీలో సీతారామం ఫేం మృణాళ్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

అయితే ఈమూవీ షూటింగ్ కోసం అమెరికా వెళ్లారు టీమ్. అయితే అక్కడ షూటింగ్ చేసుకుంటూనే...ఖాళీ టైమ్ లో చిల్అవుతున్నాడు విజయ్. న్యూయార్క్‌లో కాఫీని ఎంజాయ్ చేస్తూ.. డిన్నర్లు డిఫరెంట్ గా ప్లాన్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా విజయ్ ఓ కేఫ్‌కు వెళ్లాడు. వైట్‌ అండ్ వైట్‌ డ్రెస్‌లో ఉన్న విజయ్‌ దేవరకొండ కాఫీ తాగుతున్న స్టిల్‌తోపాటు అభిమానులతో దిగిన సెల్ఫీ ఫొటోలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. అయితే విజయ్ స్టైలీష్ గా హ్యాండ్సమ్ గా కనిపించాడు.

అయితే ఈ ఫోటోల్లో విజయ్ ఒక్కడే కనిపించాడు. కాని తాను ఎవరితో వెళ్ళాడా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు విజయ్. ఫ్యామిలీ స్టార్ సినిమాతో పాటు జెర్సీ ఫేం గౌతమ్‌ తిన్ననూరి డైరెక్షన్‌లో VD12లో కూడా నటిస్తున్నాడు. కాప్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌-శ్రీకర స్టూడియోస్‌ బ్యానర్‌ సంయుక్తంగా నిర్మిస్తన్నాయి. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోండగా.. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నాడు.

Updated On 21 Dec 2023 7:24 AM GMT
Ehatv

Ehatv

Next Story