పెళ్ళి గురించి తనకు చాలా మంది చాలా విషయాలు చెప్పారంటున్నాడు విజయ్ దేవరకొండ. చాలా మంది చాలా అనుకుంటున్నారని.. అసలు తాను పెళ్లి చేసుకుంటానా లేదా అన్న డౌట్ కూడా చాలా మందకి ఉందని..కాని తాను పెళ్ళికి భయపడనంటున్నాడు. తనకు పెళ్ళిపై నమ్మకం ఉందన్నారు. విజయ్ దేవరకొండు. ఇక తాను ఎప్పుడు పెళ్లి చేసుకోబోయేది కూడా ప్రకటిచారు రౌడీ హీరో.

పెళ్ళి విషయంలో క్లారిటీ ఇచ్చాడు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda). పెళ్ళి గురించి ఎన్నో సార్లు అడిగిన వారికి.. చిరాగ్గా సమాధానం చెప్పిన విజయ్.. ఈసారి మాత్రం చాలా ఓపిగ్గా.. తన పెళ్లి కబురు వినిపించాడు. ఇంతకీ విజయ్ ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు తెలుసా..?

పెళ్ళి గురించి తనకు చాలా మంది చాలా విషయాలు చెప్పారంటున్నాడు విజయ్ దేవరకొండ. చాలా మంది చాలా అనుకుంటున్నారని.. అసలు తాను పెళ్లి చేసుకుంటానా లేదా అన్న డౌట్ కూడా చాలా మందకి ఉందని..కాని తాను పెళ్ళికి భయపడనంటున్నాడు. తనకు పెళ్ళిపై నమ్మకం ఉందన్నారు. విజయ్ దేవరకొండు. ఇక తాను ఎప్పుడు పెళ్లి చేసుకోబోయేది కూడా ప్రకటిచారు రౌడీ హీరో.

ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో.. అందరి చూపు విజయ్ వైపే ఉంది. ఒకరిద్దరు తప్పించి చాలా మంది పెళ్ళిళ్లు.. ఈరెండు మూడేళ్లలో అయిపోయాయి. నితిన్, నిఖిల్, శర్వానంద్, కార్తికేయా, ఇలా ఒకరితరువాత మరొకరు.. ఓ ఇంటివారు అయ్యారు. ఇక మిగిలి ఉన్న హీరోలలో పెళ్లి కానిప్రసాదుల లిస్ట్ లో విజయ్ మాత్రం ముందు ఉన్నాడు. కాని కెరీర్ లో స్టార్ డమ్ వచ్చినా.. చాలా కాలంగా సాలిడ్ హిట్ పడలేదు విజయ్ కు. అయితే విజయ్ అంటే మాత్రం లేడీ ఫ్యాన్స్ చచ్చిపోతామంటారు. అంత పిచ్చి రౌడీ హీరో అంటే.

అయితే ఈమధ్య విజయ్ దేవరకొండ ఎక్కడికి వెళ్లినా కామన్ క్వశ్చన్ ఒకటి వినిపిస్తుంటుంది. అదే పెళ్ళెప్పుడని. గతంలో ఈ ప్రశ్న వినిపిస్తే.. కాస్త కోపంగా సమాధానం చెప్పేవాడు విజయ్. కాని ఈసారి మత్రం చాలా ఓపిగ్గా సమాధానం ఇచ్చాడు. తాజాగా ఖుషీ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు టీమ్. తాజాగా రిలీజ్ చేసిన ఖుషీ ట్రైలర్ అయితే అద్భుతమైన రెస్పాన్స్ దో దూసుకుపోతోంది. ప్రేమ పెళ్లి.. సంసార జీవితం.. గొడవలు కాన్సెప్ట్ తో రాబోతున్నట్టు తెలుస్తోంది. మరోసారి ఈసినిమా తో తన మార్క్ చూపించబోతున్నాడు దర్శకుడు శివ నిర్వాణ. ఈక్రమంలో కుషీ ట్రైలర్ రిలీజ్ లో ఇంట్రెస్టింగ కామెట్స్ చేశాడు విజయ్ దేవరకొండ.

ఖుషి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా నిర్వహించి మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు చిత్రయూనిట్. ఈ ఈవెంట్ లో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు చిత్రయూనిట్. ఓ మీడియా ప్రతినిధి విజయ్ దేవరకొండని పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడిగాడు. విజయ్ దేవరకొండ పెళ్లి గురించి మాట్లాడుతూ.. ఒకప్పుడు పెళ్లి గురించి మాట్లాడాలన్నా కోపం వచ్చేది. కానీ ఇప్పుడు నేను కూడా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. నా ఫ్రెండ్స్ చాలా మంది ఇటీవల పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. వారితో పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది అని డిస్కస్ చేస్తుంటాను. కొంతమంది లైఫ్ లో జరిగే సంఘటనలు చూసి పెళ్లి అంటే భయం పోయింది అన్నారు విజయ్. ముడేళ్ళల్లో నేను పెళ్లి చేసుకుంటాను. అప్పుడు నేనే అందరికి చెప్తాను అని విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చేశాడు.

విజయ్ దేవరకొండ, సమంత జంటగా కలిసి నటించిన సినిమా ఖుషి. ఈసినిమా సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటి వరకూ సాలిడ్ హిట్ లభించని విజయ్ కు .. ఈసారి కాస్త రిలీజ్ వస్తుంది అని ఫ్యాన్స్ ఎదరు చూస్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా మూవీ లైగర్ ఫ్లాప్ తర్వాత ఒక మంచి రొమాంటిక్ లవ్ స్టోరీతో విజయ్ రాబోతున్నాడు. సమంత కూడా శాకుంతలం ఫ్లాప్ తర్వాత ఈ సినిమాతో వస్తుండటంతో ఇండస్ట్రీలో, ఫ్యాన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి.

Updated On 11 Aug 2023 6:12 AM GMT
Ehatv

Ehatv

Next Story