అగ్రశ్రేణి నటి సమంత(Samantha), రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda) జంటగా నటిస్తున్న ఖుషి సినిమా(Kushi Movie) షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. టర్కీ(Turkey)లో షెడ్యూల్‌ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలను సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

అగ్రశ్రేణి నటి సమంత(Samantha), రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda) జంటగా నటిస్తున్న ఖుషి సినిమా(Kushi Movie) షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. టర్కీ(Turkey)లో షెడ్యూల్‌ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలను సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. టర్కీలో ఆటపాటలతో సరదాగా గడిపేస్తున్న హీరో హీరోయిన్లు మధ్యలో చిత్రీకరణ నుంచి కొంచెం విరామం దొరకడంతో లంచ్‌కు వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోను షేర్‌ చేస్తూ విజయ్‌తో తనకున్న అనుబంధాన్ని అభిమానులతో పంచుకున్నారు సమంత. 'నిన్ను చివర్లో ఉండటం చూశాను. ఫస్ట్‌లో ఉండటం చూశాను. నీ జీవితంలో ఎదుర్కొన్న ఎత్తు పల్లాలను చూశాను. ఎలాంటి పరిస్థితుల్లోనూనా కంత మంది స్నేహితులు మనతోనే ఉండిపోతారు' అని ఇన్‌స్టాలో రాశారు సమంత. ఈ పోస్టుపై విజయ్‌ దేవరకొండ స్పందించారు. ' సామ్‌ నా ఫేవరెట్‌ లేడీ' అని పేర్కొన్నారు. దీంతో వీరిద్దరి ఫ్రెండ్‌షిప్‌ చూడముచ్చటగా ఉందని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. కశ్మీర్‌ నేపథ్యంలో సాగే విభిన్న ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ ముగింపుకు చేరుకుంది. ప్రస్తుతం టర్కీలో సమంత, విజయ్‌లపై ఓ పాట చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌ ముగిసిన వెంటనే హైదరాబాద్‌లో మరో చిన్న షెడ్యూల్‌ను పూర్తి చేసి జూన్‌ నెలాఖరు నాటికి సినిమాకు గుమ్మడికాయ కొట్టనున్నారు. శివ నిర్వాణ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.

Updated On 2 Jun 2023 1:24 AM GMT
Ehatv

Ehatv

Next Story