టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarkonda), నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) జోడి ఆన్ స్క్రీన్‌లో భలేగా ఉంటుంది. వీరిద్దరి కలయికలో వచ్చిన గీతగోవిందం(Geetagovindham) సినిమా సెన్సెషనల్ హిట్ కొట్టింది. ఆ మధ్యన విజయ్ దేవరకొండ నటించిన ఖుషి(Kushi) విడుదలయ్యింది. మంచి మార్కులే సంపాదించింది. లేటెస్ట్‌గా రష్మిక మందాన్న నటించిన బాలీవుడ్ మూవీ యానిమల్(animal) బ్లాక్‌బస్టర్ సాధించింది.

Rashmika-Vijay Engagement
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarkonda), నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) జోడి ఆన్ స్క్రీన్‌లో భలేగా ఉంటుంది. వీరిద్దరి కలయికలో వచ్చిన గీతగోవిందం(Geetagovindham) సినిమా సెన్సెషనల్ హిట్ కొట్టింది. ఆ మధ్యన విజయ్ దేవరకొండ నటించిన ఖుషి(Kushi) విడుదలయ్యింది. మంచి మార్కులే సంపాదించింది. లేటెస్ట్‌గా రష్మిక మందాన్న నటించిన బాలీవుడ్ మూవీ యానిమల్(animal) బ్లాక్‌బస్టర్ సాధించింది. అయితే విజయ్, రష్మిక గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి(Marriage) కూడా చేసుకుంటారని సోషల్ మీడియాలో(Social media) అడతాదడపా వార్తలు వస్తుంటాయి. ఈ వార్తలను వారెప్పుడూ ఖండించలేదు. అలాంటి వార్తలు రావడానికి కారణం ఉంది. వీరిద్దరూ కలిసి ఒకే లోకేషన్‌లో దిగిన ఫోటోలను వేర్వేరుగా ఇన్‌స్టా్గ్రామ్‌లో పోస్టులు చేస్తుంటారు. ఇదిలాఉంటే వీరిద్దరికి సంబంధించిన మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనేది ఆ వార్త! పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలయ్యాయని సమాచారం. ఫిబ్రవరి రెండో వారంలో ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారట! ఇది చూసిన ఫ్యాన్స్ మస్తు ఖుషి అవుతున్నారు. క్యూట్ పెయిర్‌కు విషెష్ చెబుతున్నారు. కొందరేమో ఇది ఫేక్ న్యూస్ అని కొట్టిపారేస్తున్నారు. ఇది నిజమో, కాదో తెలియాలంటే ఇద్దరిలో ఎవరో ఒకరు రియాక్టవ్వాలి.
