విజయ్ దేవరకొండ(vijay devarkonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి(Gautham Thinanuri) దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertaiments), ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో(Fortune for cinemas) కలిసి ఓ చిత్రాన్ని రూపొందించనున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ కెరీర్ లో 12వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఎస్. నాగ వంశీ(s. naga vamsi), సాయి సౌజన్య(Sai soujanya) సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
విజయ్ దేవరకొండ(vijay devarkonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి(Gautham Thinanuri) దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertaiments), ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో(Fortune for cinemas) కలిసి ఓ చిత్రాన్ని రూపొందించనున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ కెరీర్ లో 12వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఎస్. నాగ వంశీ(s. naga vamsi), సాయి సౌజన్య(Sai soujanya) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. "I don't know where I belong, to tell you whom I betrayed - Anonymous Spy" అంటూ జనవరిలో ఈ సినిమాని అధికారికంగా ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. కేవలం ప్రకటన పోస్టర్ తోనే అంచనాలు ఏర్పడేలా చేసిన ఈ చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
పలువురు ప్రముఖుల సమక్షంలో ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్(rama naidu studios) లో 'VD12' చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. గతంలో గౌతమ్ తిన్ననూరి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ 'జెర్సీ'(jersy) చిత్రం కోసం జతకట్టారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబట్టి ఘన విజయం సాధించింది. 'జెర్సీ' సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది. ఇప్పుడు ఈ ప్రతిభకు, అతి కొద్ది కాలంలోనే దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న విజయ దేవరకొండ తోడయ్యారు. అభిమానుల, ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అద్భుతమైన చిత్రాన్ని అందిస్తామని మూవీ టీమ్ చెబుతోంది.
ఈ చిత్రంలో విజయ్ సరసన హీరోయిన్ గా శ్రీలీల(srileela) నటిస్తుంది. తన అందం, అభినయం, నాట్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతున్న ముద్దు గుమ్మ మొదటిసారి విజయ్ తో జోడీ కడుతున్నారు. ఇక 'జెర్సీ'లో తన సంగీతంతో కట్టిపడేసిన అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. 'జెర్సీ'తో జాతీయ అవార్డును అందుకున్న నవీన్ నూలి ఎడిటర్ గా పని చేయనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా గిరీష్ గంగాధరన్, ఆర్ట్ డైరెక్టర్ గా అవినాష్ కొల్లా వ్యవహరిస్తున్నారు. ఇలా ఎందరో ప్రతిభావంతులు కలిసి పని చేస్తున్న ఈ సినిమా షూటింగ్ జూన్ నుండి ప్రారంభం కానుంది.