విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda) కెరీర్‌లో గీత గోవిందం సినిమా చాలా పెద్ద హిట్‌! అసలు ఆ సినిమానే విజయ్‌ను అగ్రస్థానంలో నిలబెట్టిందంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌ పతకాంపై అల్లు అరవింద్‌(Allu Arvind) నిర్మించారు. పరశురామ్(Parasuram) దీనికి దర్శకుడు. అయితే ఈ సినిమా తర్వాత విజయ్‌ దేవరకొండ- పరశురామ్‌ కాంబినేషన్‌లో మరో సినిమా వస్తే బాగుండని రౌడీ హీరో ఫ్యాన్స్‌ ముచ్చపడ్డారు. ఇప్పుడు వారి కోరిక తీరబోతున్నది.

విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda) కెరీర్‌లో గీత గోవిందం సినిమా చాలా పెద్ద హిట్‌! అసలు ఆ సినిమానే విజయ్‌ను అగ్రస్థానంలో నిలబెట్టిందంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌ పతకాంపై అల్లు అరవింద్‌(Allu Arvind) నిర్మించారు. పరశురామ్(Parasuram) దీనికి దర్శకుడు. అయితే ఈ సినిమా తర్వాత విజయ్‌ దేవరకొండ- పరశురామ్‌ కాంబినేషన్‌లో మరో సినిమా వస్తే బాగుండని రౌడీ హీరో ఫ్యాన్స్‌ ముచ్చపడ్డారు. ఇప్పుడు వారి కోరిక తీరబోతున్నది. ఇప్పటికే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమయ్యింది. రెగ్యులర్‌ చిత్రీకరణకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ఇప్పటికే ముహూర్తం కూడా ఖరారు చేశారు. ఈ నెల 12 నుంచి హైదరాబాద్‌(Hyderabad)లో తొలి షెడ్యూల్‌ ప్రారంభించనున్నారని సమాచారం. ఇక్కడ నెలాఖరు వరకు చిత్రీకరణ జరిపిన తర్వాత సినిమా యూనిట్‌ అమెరికా(America)కు ప్రయాణం అవుతుంది. ఈ సినిమాకు సంబంధించిన కొంత భాగం అమెరికా నేపథ్యంలో ఉంటుందట! అందుకే అక్కడ షూటింగ్‌ చేయడానికి టీమ్‌ వెళుతోంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ సరసన సీతారామం ఫేమ్‌ మృణాల్‌ ఠాకూర్‌(Mrunal Thakur) నటిస్తున్నారు. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఫ్యామిలీ స్టార్‌ అనే టైటిల్‌ను ఆలోచిస్తున్నారు. 2024 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.

Updated On 7 July 2023 6:16 AM GMT
Ehatv

Ehatv

Next Story