Vijay Devarkonda : విజయ్ దేవరకొండను టార్గెట్ చేసిన హీరో ఎవరు?
విజయ్ దేవరకొండ(Vijay Devarkonda) అగ్ర కథానాయకులలో ఒకరు. అర్జున్ రెడ్డి(arjun reddy) సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నారు. హీరోగా ఎదగడానికి ఆయన చాలా కష్టపడ్డారు. ఇండస్ట్రీలో ఆయనకు గాడ్ ఫాదర్లు లేరు. విజయ్ దేవరకొండ తాతలు, తండ్రులు సినీ పరిశ్రమకు చెందిన వారేమీ కాదు.

Vijay Devarkonda
విజయ్ దేవరకొండ(Vijay Devarkonda) అగ్ర కథానాయకులలో ఒకరు. అర్జున్ రెడ్డి(arjun reddy) సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నారు. హీరోగా ఎదగడానికి ఆయన చాలా కష్టపడ్డారు. ఇండస్ట్రీలో ఆయనకు గాడ్ ఫాదర్లు లేరు. విజయ్ దేవరకొండ తాతలు, తండ్రులు సినీ పరిశ్రమకు చెందిన వారేమీ కాదు. అయినా టాప్ స్టార్ హోదా సంపాదించుకున్నారు. విజయ్ ఎంత భిన్నమైన యాక్టరో, ఆయన అభిమానులు కూడా అంతే విభిన్నం. రౌడీ(Rowdy) అనే పదానికి హీరో వర్షిప్ తీసుకొచ్చాడు విజయ్! లైగర్‌తో(Liger) బాలీవుడ్‌లో కూడా ఎంటరయ్యాడు. తనపై కొందరు ఉద్దేశపూర్వకంగా దుష్ర్పచారం చేస్తున్నారని ఇటీవల విజయ్ కామెంట్ చేశాడు. కొందరు డబ్బలిచ్చి మరీ తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నారని అన్నాడు. తనకు వ్యతిరేకంగా కొందరు యూ ట్యూబ్ చానెల్స్ నడుపుతున్నారని చెప్పాడు. ఖుషి(Kushi) సినిమా సక్సెస్ మీట్‌లో(Success meet) విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇలా చేస్తున్నవారిలో తెలుగు సినిమా హీరోలలు కొందరు ఉన్నారట! ఇంతకీ విజయ్‌ను టార్గెట్ చేసిన హీరో ఎవరు? విజయ్ అంటే ఆ హీరోకు ఎందుకంత కోపం?
