ఇక అప్పుడుప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూ వస్తున్నారు. ఎంతలా అంటే.. వీరిద్దరికి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. అదికూడా ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ లో వీరికి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగింది. దానిక తోడు ఇద్దరు స్టార్లు కలిసి డిన్నర్ డేట్లు, బ్యాచిలర్ పార్టీలు చేసుకోవడంతో పాటు.. విజయ్ ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కూడా రష్మిక కనిపించడంతో వీరి బంధానికి సబంధించి బలంగా ఫిక్స్ అవుతూ వస్తున్నారు ఆడియన్స్.
గత కొద్ది రోజులుగా.. విజయ్ దేవరకొండ.. రష్మిక మందన్నా డేటింగ్ వార్తలు సోషల్ మీడియాల వైరల్ అవుతూ వస్తున్నాయి. ఈ ఇద్దరు స్టార్లు కలిసి గీతగోవింద తో పాటు.. డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించారు. డియర్ కామ్రేడ్ టైమ్ నుంచి వీరిపై రకరకాల వార్తలు ఎప్పటికప్పుడు వేడివేడిగా ఆడియన్స్ కు అందిస్తున్నాయి సోషల్ మీడియా సైట్లు. అయితే ఈ విషయంలో వారు ఎప్పుడు స్పందించలేదు కాని.. అప్పుడప్పుడు డిన్నర్ డేట్స్ కోసం ముంబయ్ లో కలుసుకుంటూ.. కెమెరాల కంట పడుతూ వస్తున్నారు వీరు.
ఇక అప్పుడుప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూ వస్తున్నారు. ఎంతలా అంటే.. వీరిద్దరికి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. అదికూడా ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ లో వీరికి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగింది. దానిక తోడు ఇద్దరు స్టార్లు కలిసి డిన్నర్ డేట్లు, బ్యాచిలర్ పార్టీలు చేసుకోవడంతో పాటు.. విజయ్ ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కూడా రష్మిక కనిపించడంతో వీరి బంధానికి సబంధించి బలంగా ఫిక్స్ అవుతూ వస్తున్నారు ఆడియన్స్.
ఆమధ్య న్యూ ఇయర్ సెలబ్రెషన్స్ కోసం ఇద్దరు మాల్దీవులకు వెళ్ళి బాగా ఎంజాయ్ చేశారని తెలుస్తోంది. ఇద్దరు కలిసి ఫోటోలు పంచుకోకపోయినా.. విడి విడిగా పెట్టిన ఫోటోస్ లో.. ఇద్దరు మాల్దీవ్స్ లో ఉన్నట్టు అర్ధం అయ్యింది ఆడియన్స్ కు. దాంతో ఇద్దరు త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ విషయంలో ఇద్దరు స్టార్ల నుంచి ఎటువంటి రియాక్షన్ లేకపోవడంతో నచ్చిన కథలు అల్లుకుంటూ వెళ్తున్నారు సోషల్ మీడియా జనాలు.
తాజాగా రష్మిక మందన్నా బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి అయితే రష్మిక బర్త్ డే సందర్భంగా ఆమె ఇన్స్టాగ్రామ్లో అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేసింది బ్యూటీ. చిత్రం ఏమిటంటే.. కాసేపటికే విజయ్ దేవరకొండ కూడా సేమ్ లొకేషన్లో ఉన్న ఓ ఫోటో బయటకు వచ్చింది. దీంతో.. ఓ మీడియా సంస్థం ఈ ఫోటోలు బేస్ చేసుకుని ఓ స్టోరీని ప్రచురించింది. విజయ్-రష్మికల డేటింగ్ నిజమే అంటూ.. కన్ఫామ్ చేసింది. అంతే కాదు బర్త్ డేసందర్భంగా ఇద్దరు ఒకే చోట సెలబ్రేషన్స్ చేసుకున్నట్టు రాసింది. విజయ్ దేవరకొండ తనకు ఇష్టమైన రింగ్ ను రష్మికకు తొడిగినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇక ఇదే నిజంఅయితే.. వీరి పెళ్ళి విషయంలో అనౌన్స్ మెంట్ కోసం ఫ్యాన్స్ ఎదరు చూసడాలి. మరి వీరిద్దరి బంధంపై అఫీషియల్ అగా అనౌన్స్ మెంట్ ఎప్పుడు ఇస్తారా అని ఎదురుచూస్తున్నారు జనాలు. అంతే కాదు వీరి మధ్య ఏం లేకపోతే.. ఇన్ని రూమర్స్ వస్తున్నప్పుడు వాటిని ఎందుకు ఖండించడం లేదు అంటుంన్నారు సినిమా పండితులు.