గత కొంతకాలంగా సరైన హిట్ లేక డీలా పడిన రౌడీ హీరో విజయ్ దేవరకొండకు(vijay Devarkonda) ఖుషి(Kushi) సినిమా సక్సెస్ ఖుషినిచ్చింది. కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. కాకపోతే ఆ విజయాన్ని విజయ్ ఎంజాయ్ చేసే మూడ్‌లో లేరు. అందుకు కారణం ఖుషి విజయవంతమైన ఆనందంలో తన అభిమానులకు విజయ్ దేవరకొండ బంపరాఫర్ ఇచ్చారు. వంద కుటుంబాలకు కలిపి కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించాడు. ఈ ప్రకటన రాగానే ఓ నిర్మాణ సంస్థ విజయ్‌కు కౌంటర్ ఇచ్చింది. ట్విట్టర్‌లో(Twitter) ఓ పోస్ట్ పెట్టింది.
గత కొంతకాలంగా సరైన హిట్ లేక డీలా పడిన రౌడీ హీరో విజయ్ దేవరకొండకు(Vijay Devarkonda) ఖుషి(Kushi) సినిమా సక్సెస్ ఖుషినిచ్చింది. కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. కాకపోతే ఆ విజయాన్ని విజయ్ ఎంజాయ్ చేసే మూడ్‌లో లేరు. అందుకు కారణం ఖుషి విజయవంతమైన ఆనందంలో తన అభిమానులకు విజయ్ దేవరకొండ బంపరాఫర్ ఇచ్చారు. వంద కుటుంబాలకు కలిపి కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించాడు. ఈ ప్రకటన రాగానే ఓ నిర్మాణ సంస్థ విజయ్‌కు కౌంటర్ ఇచ్చింది. ట్విట్టర్‌లో(Twitter) ఓ పోస్ట్ పెట్టింది. 'వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసి రూ.8 కోట్లు పోగొట్టుకున్నాం, దీనిపై ఎవరూ స్పందించట్లేదు. ఎలాగో మీరు వంద కుటుంబాలకు కోటి ఇస్తామంటున్నారు. అలాగే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్స్ కుటుంబాలను కూడా ఆదుకుంటారని ఆశిస్తున్నాం' అని అభిషేక్ పిక్చర్స్(Abhishek Pictures) వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. ఇది విజయ్‌కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. వాస్తవానికి సినిమా లాభనష్టాలనేది నిర్మాత- డిస్ట్రిబ్యూటర్స్ మధ్య వ్యవహారం. కానీ ఇలా బహిరంగంగా డబ్బులివ్వమంటూ హీరో విజయ్‌ను టార్గెట్ చేయడమేమిటని అభిమానులు ఆగ్రహంతో అడుగుతున్నారు. ఈ వ్యవహారంపై విజయ్ దేవరకొండ తండ్రి గోవర్దన్‌రావు కూడా స్పందించారు. 'వరల్డ్ ఫేమస్ లవర్(World Famous Lover) సినిమా సరిగ్గా ఆడనప్పుడు విజయ్ తన పారితోషికంలో సగానికి సగం వెనక్కి ఇచ్చేశాడు. తనకు ఇస్తానన్న ఫ్లాట్ కూడా వద్దన్నాడు. ఇంతకంటే ఇంకేం చేయగలడు? అయినా డిస్ట్రిబ్యూటర్‌కు నష్టాలు వస్తే విజయ్ ఏం చేస్తాడు? అది నిర్మాతతో తేల్చుకోవాల్సిన విషయం. చాన్నాళ్లుగా అభిషేక్ మమ్మల్ని ఇబ్బందిపెడుతున్నాడు. మేము అతడితో మాట్లాడుతున్న విషయం కూడా విజయ్‌కు తెలియదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా సోషల్ మీడియాలో నా కొడుకు పేరు ప్రస్తావించడం బాధగా ఉంది. నిజంగా మేము అతడికి ఏమైనా డబ్బులిచ్చేది ఉంటే కోర్టుకు వెళ్లి తేల్చుకోవాల్సింది' అని గోవర్దన్‌రావు(Govardhan) అన్నారు.' అభిషేక్ నా కొడుకును బ్లాక్‌మెయిల్ చేయాలని చేస్తున్నాడు. కానీ అతడి పప్పులేమీ ఉడకవు. ఒకసారేమో విజయ్ మార్కెట్ పడిపోయిందంటాడు. మరోసారి విజయ్‌తో సినిమా నిర్మించేందుకు అతడి డేట్స్ కావాలంటాడు. అతడు మాట్లాడే మాటలకు ఏ మాత్రం పొంతన లేదు. అయినా మా విజయ్ ఇప్పటికే దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లలో సినిమాలను ఒప్పుకున్నాడు. ప్రస్తుతం అతడి డేట్స్ ఖాళీగా లేవు. నామా అభిషేక్‌తో విజయ్ సినిమాలు చేయడు' అని వివరణ ఇచ్చుకున్నారు గోవర్దన్ రావు.