✕
విజయ్ దేవరకొంద హీరోగా వస్తూనే ఓ స్పెషల్ ట్రెండ్‌ని జేబులో పెట్టుకుని వచ్చాడా అనిపిస్తుంది. సైడ్ హీరోగా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో పూర్తిగా విశ్వరూపం దాల్చేశాడు. ఆ ఫ్యాషన్ ఏమిటో...ఆ ట్రెండ్ ఏమిటో తేల్చుకునేలోపే విజయ్ యువత గుండెచప్పుడుగా మారిపోయాడు. విజయ్‌ది కంప్లీట్‌గా న్యూ ఫ్యాషన్. ఎవరూ ఎప్పుడూ ఊహించని ధోరణి. అదీ కుర్రకారుతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కొంతశాతం విజయ్ అంటే ఆకర్షణ ఫీలయ్యేవారే ఉండడం ఇక్కడ వైచిత్రి.

x
vijay devarakonda
-
- వరల్డ్ సినిమాలోనే అటువంటి టైటిల్ ఎవరికీ లేదు. అటువంటి టైటిల్‌ని ఎవరూ పెట్టరు. పెట్టుకోరు. కావాలంటే సినిమాలకి పెడతారు. రౌడీ అనీ, గూండా అనీ, పోకిరి అనీ. ఈ టైటిల్స్ మామ్మూలుగా అయితే ఒక తరానికి చాలా ఎబ్బెట్టుగా ఉండే టైటిల్స్. కానీ, తరాలు మారుతున్న కొద్దీ సినిమా కొంత రఫ్నెస్ని అలవాటు చేసుకునే ట్రెండ్స్ రాకతప్పలేదు. కానీ ఓ హీరోకి రౌడీ అనే టైటిల్ క్రేజ్ తీసుకురావడమన్నది ఎంతైనా విచిత్రమే. కానీ అది చాలా నేచురల్‌గా అందరి ఎటెన్షన్ని క్యాచ్ చేయడం మరింత ప్రత్యేకం. విజయ్ దేవరకొంద హీరోగా వస్తూనే ఓ స్పెషల్ ట్రెండ్‌ని జేబులో పెట్టుకుని వచ్చాడా అనిపిస్తుంది. సైడ్ హీరోగా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో పూర్తిగా విశ్వరూపం దాల్చేశాడు. ఆ ఫ్యాషన్ ఏమిటో...ఆ ట్రెండ్ ఏమిటో తేల్చుకునేలోపే విజయ్ యువత గుండెచప్పుడుగా మారిపోయాడు. విజయ్‌ది కంప్లీట్‌గా న్యూ ఫ్యాషన్. ఎవరూ ఎప్పుడూ ఊహించని ధోరణి. అదీ కుర్రకారుతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కొంతశాతం విజయ్ అంటే ఆకర్షణ ఫీలయ్యేవారే ఉండడం ఇక్కడ వైచిత్రి.
-
- నిజానికి విజయ్‌కి వచ్చినంత పాప్యులారిటీకి సరిపోయే అన్ని సినిమాలూ చేయలేదు. అన్ని హిట్స్ కూడా లేవు. పెద్దపెద్ద ప్రకటనలు, ప్రెస్మీట్లు కూడా ఉండవు. అస్సలు మీడియాకే దొరకడు. ఎప్పుడో ఏదో ఫంక్షన్లో మాత్రమే ప్రత్యక్షమవుతుంటాడు. మరి ఏమిటింత పాప్యులారిటీ? ఏమిటింత ఫాలోయింగ్? అదే తమాషా విజయ్‌లో. మహానటి సినిమాలో చేసినా అదంతా కీర్తి సురేష్ సోలో పెరఫారమెన్స్. మెయిన్‌గా విలన్లాటి హీరో దుల్కర్ సల్మాన్ ఉండనే ఉన్నాడు. విజయ్ కూడా మహానటిలో చేశాను అని చెప్పుకోవచ్చు. కానీ అది విజయ్ సినిమా కాదు.
-
- ఎంతో గొప్పగా ఆడేస్తుందనుకున్న వరల్డ్ ఫేమస్ లవర్ వస్తోందంటే విజయ్ ఫేన్వరల్డ్ పిచ్చెక్కిపోయింది. తీరా చూస్తే అది కాస్తా బాక్సాఫీసు దగ్గర బోల్తా పడిపోయింది. అయినా విజయ్ క్రేజ్ తగ్గలేదు. పైగా ఇంకా పెరిగిపోయింది. టాక్సీవాలాలు వగైరా పెద్దగా చర్చకు రానేరావు. అయినా సరే విజయ్ ఈ రోజున యూత్‌లో ఓ ఐకన్‌గా ఎదిగాడు. విజయ్ సినిమా గురించి యూత్‌లో ఉన్న మేల్ అంగ్ ఫిమేల్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తారు. చూస్తున్నారు. ఖుషీ వస్తోందంటే అదో పెద్ద సందడిగా మారిపోయింది. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం...ఇలా ప్రచార తరహాలు పూర్తిగా మారిపోయిన రోజుల్లో మేగ్జైన్లు పూర్తిగా మూల పడిపోయాయి. ఈ సోషల్ ప్లాట్ఆమ్స్ అన్నిటినీ సెర్చ్ లైట్లు పెట్టుకుని మరీ అందరూ విజయ్ వార్తలు గురించి వెతుక్కుంటున్నారంటే...అదీ ఓ స్పెషల్ టచ్. అది విజయ్ దేవరకొండకి మాత్రమే చెల్లింది. ఇలాటి ఫాలోయింగ్ ఉన్న హీరోకి అర్జున్రెడ్డిలాటి హిట్ పడితే ఇంకేమైనా ఉందా? మొత్తం తలకిందులవుతుంది ఇండస్ట్రీలో ఆర్డర్. రివర్స్ గేర్ అయిపోతుంది వ్యవహారం.
-
- ఇందులో ప్రధానమైన కారణం ఒక్కటే కనిపిస్తుంది. సాధారణంగా మెగాస్టార్ చిరంజీవి వచ్చినతర్వాత ఆయన తరహాలో ఎవరైనా ఏ సపోర్ట్ లేకుండా సినిమా పరిశ్రమలో గనక ఎదగితే వాళ్ళకి తప్పనిసరిగా గుర్తింపు వచ్చి తీరుతుంది. ఓ రవితేజ, ఓ నాని ఇలా....ఇదే కోవలో పరిశ్రమలోకి వచ్చిన హీరో విజయ్ దేవరకొండ. చిన్న గుర్తింపు వచ్చిన తర్వాత మళ్ళీ అంతా మామ్మూలే. అందగాడు, భేషజం లేకుండా మాట్లాడతాడు, లోపల ఏముందో తెలియదు గానీ, ఫెయిర్‌గా ఉంటాడు...ఇలాటివేవో కామెంట్స్ విజయ్ మీద వినిపిస్తుంటాయి. కామెంట్స్, కాంట్రవర్సీలు మాత్రం ఎక్కడా లేకపోవడం పబ్లిక్ డీసెన్సీని మాత్రం విజయ్ సొంతం చేసుకోగలిగాడు.
-
- ది విజయదేవరకొండ అని పెట్టుకున్నాడని అనసూయ యుద్దానికి దిగితే ఆమె దోషిగా కనిపించే పరిస్థితి ఎదురైంది ఆమెకి. గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ కూడా ది విజయ్ దేవరకొండ అని ట్వీట్ చేసి బర్త్ డే విషెస్ తెలిపాడంటే విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ రేంజ్లో ఉందో చెప్పనక్కర్లేదు. దర్శకుడు హరీష్ శంకర్ అయితే నాలుగు వాక్యాల్లో లక్ష దిలు పెట్టి మరీ అభినందనలు తెలియజేశాడు. అదీ విజయ్ దేవరకొండ. విజయ్‌కి ఇప్పుడు కావాల్పింది కేవలం ఒక్క పెద్ద హిట్ మాత్రమే. అదొక్కటే ఆయనకి ముందు దారి చూపించేది. ఈహా టీవి అండ్ వెబ్సైట్ సంయుక్తంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి మన హేండ్సమ్ రౌడీహీరో విజయ్ దేవరకొండకి. ” Written By : నాగేంద్రకుమార్ “

Ehatv
Next Story