అభిమానులు రౌడీ(Rowdy boy) అని ముద్దుగా పిల్చుకునే విజయ్‌ దేవరకొండ(Vijay devarkonda) సినిమాలకు బోల్డంత క్రేజ్‌ ఉంటుంది.

అభిమానులు రౌడీ(Rowdy boy) అని ముద్దుగా పిల్చుకునే విజయ్‌ దేవరకొండ(Vijay devarkonda) సినిమాలకు బోల్డంత క్రేజ్‌ ఉంటుంది. షార్ట్ పిరియడ్‌లోనే స్టార్‌ హీరోగా ఎదిగిన విజయ్‌కు ఫ్యాన్స్‌ కూడా ఎక్కువే! ఇప్పుడతను నేషనల్ హీరో(). ఆయన సినిమా వస్తుందంటే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టి ఉంటుంది. మళ్లీ రావా, జెర్సీ చిత్రాలతో ఆకట్టుకున్న గౌతమ్‌ తిన్ననూరితో(Goutham Thinnanuri)విజయ్‌ ఓ సినిమా చేస్తున్నాడు. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంతో అందరినీ థ్రిల్ చేయడానికి సిద్ధమవుతున్నారు. 'VD12' అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో ఇది మొదటి సినిమా కావడంతో 'VD12' పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని అద్భుతంగా మలుస్తున్నారు. థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడమే లక్ష్యంగా, ఎక్కడా రాజీ పడకుండా ఎంతో శ్రద్ధతో, అవిశ్రాంతంగా పని చేస్తోంది చిత్ర బృందం. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ శ్రీలంకలోని సుందరమైన ప్రదేశాల్లో జరిగింది. ఇప్పటిదాకా 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ క్రమంలో చిత్ర విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్‌ . 2025, మార్చి 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు.

సంచలన స్వరకర్త, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ ఛాయగ్రాహకులు గిరీష్ గంగాధరన్, జోమోన్ టి జాన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story