విజయ్ దేవరకొండను ఓవర్‌నైట్ స్టార్‌ను చేసిన సినిమా అర్జున్ రెడ్డి. చాలా సైలెంట్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను కుమ్మేసింది. అప్పటికీ విజయ్ దేవరకొండ పెద్ద స్టారేమీ కాదు. సినిమాలో ఎవరూ పెద్ద స్టార్లు లేరు.
విజయ్ దేవరకొండను ఓవర్‌నైట్ స్టార్‌ను చేసిన సినిమా అర్జున్ రెడ్డి. చాలా సైలెంట్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను కుమ్మేసింది. అప్పటికీ విజయ్ దేవరకొండ పెద్ద స్టారేమీ కాదు. సినిమాలో ఎవరూ పెద్ద స్టార్లు లేరు. పెట్టిన డబ్బులు వస్తే చాలనుకున్నారు. కేవలం కంటెంట్‌నే నమ్ముకున్నారు దర్శక నిర్మాతలు. ఆ నమ్మకం వమ్ము కాలేదు. అర్జున్ రెడ్డి ఎవరూ ఊహించని విధంగా సూపర్‌హిట్టయ్యింది. వరంగల్‌కు చెందిన సందీప్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. అవుట్ ఆఫ్ ది బాక్స్ కంటెంట్‌తో వచ్చి తెలుగు సినిమా రూపు రేఖలు మార్చేశాడు. శివ సినిమాతో రామ్‌గోపాల్ వర్మ ఎలా అయితే ట్రెండ్ సృష్టించాడో సందీప్ రెడ్డి కూడా అలాగే ఓ ట్రెండ్ సృష్టించాడు. సినిమా అంతటి ఘన విజయం సాధించినప్పటికీ ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ, సందీప్‌రెడ్డి కాంబినేషన్లో మరో సినిమా రాలేదు. వీరిద్దరు కలిసి ఓ సినిమా చేస్తే బాగుండనే కోరిక అందరిలోనూ ఉంది. వీరిద్దరి కాంబోలో సినిమా రాకపోవడానికి కారణం ఎవరికి వారు బిజీ అయిపోవడమే! సందీప్ రెడ్డి బాలీవుడ్లో తీరిక లేకుండా ఉన్నారు. విజయ్ దేవరకొండ కూడా వరుస సినిమాలో బిజీగా ఉన్నాడు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం త్వరలో ఈ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్నదట! మైత్రీ మూవీస్ అధినేతలలో ఒకరైన రవిశంకర్ సినిమాను నిర్మించబోతున్నారట! ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి కొంచెం ఆలస్యం కావొచ్చేమో కానీ సినిమా మాత్రం కచ్చితంగా ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ రెండు సినిమాలలో నటిస్తున్నారు. అవి పూర్తి కావడానికి ఎంత కాదనుకున్నా ఏడాది పడుతుంది. మరోవైపు సందీప్‌రెడ్డి కూడా రెండు భారీ చిత్రాలను రూపొందిస్తున్నారు. ఇందులో స్పిరిట్ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లబోతున్నది. ఇక అల్లు అర్జున్‌తో కూడా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట సందీప్ రెడ్డి. ఈ సినిమాలు పూర్తి కావడానికి రెండేళ్లు పడుతుంది. కాబట్టి విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డిల కాంబినేషన్ సెట్స్ మీదకు వెళ్ళాలంటే కనీసం రెండేళ్లు పడుతుంది. ఎప్పుడొచ్చినా సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు.