ఇక ఇప్పుడు తమిళ ఇండస్ట్రీకి చెందిన విజయ్ సినిమాకు రివ్యూ దెబ్బ తగిలింది

తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఇటీవల బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. సినిమా బాగుంది కావాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ ను అడగండి అంటూ నిర్మాత దిల్ రాజు మైక్ చేతబట్టుకుని థియేటర్ల దగ్గరకు వెళ్లారు. ఆయన చేసిన ప్రయత్నాలేవీ ఫ్యామిలీ స్టార్ సినిమాను థియేటర్ల దగ్గర సినిమాను కాపాడలేకపోయాయి.

ఇక ఇప్పుడు తమిళ ఇండస్ట్రీకి చెందిన విజయ్ సినిమాకు రివ్యూ దెబ్బ తగిలింది. విజయ్ ఆంటోనీ తమిళ చిత్రసీమలో ప్రముఖ నటుడు.. తెలుగులో కూడా ఆయన సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తూ ఉంటాయి. ఇటీవల విజయ్ హీరోగా నటించిన రోమియో (తెలుగులో 'లవ్ గురు' పేరుతో) థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనలను అందుకుంది. బాక్సాఫీస్ వద్ద పేలవ ప్రదర్శన చేస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి విమర్శకులు నెగటివ్ రివ్యూలను ఇస్తున్నారు. విజయ్ ఆంటోని ట్విట్టర్ లో రివ్యూలను నమ్మకండంటూ మూవీ లవర్స్ ను కోరారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేశారు. సమీక్షలను పట్టించుకోకండని.. ఓపెన్ మైండ్‌తో సినిమాను చూడాలని ప్రేక్షకులను సూచించారు. కొందరు సినిమాకు మద్దతుగా ట్వీట్ చేస్తున్నారు. వినాయక్ వైతినాథన్ రచన, దర్శకత్వం వహించిన రోమియో సినిమాలో మిర్నాళిని రవి కథానాయికగా నటించింది. ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని సొంత నిర్మాణ సంస్థ నిర్మించింది.

Updated On 21 April 2024 12:00 AM GMT
Yagnik

Yagnik

Next Story