2016లో వచ్చిన 'బిచ్చగాడు' (Bichagadu) సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు విజయ్ ఆంటోనీ. ఈ మూవీతో తెలుగులో తిరుగులేని మార్కెట్ క్రియేట్ అయింది. ఈ సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేసినప్పుడు తమిళ్‏తో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

2016లో వచ్చిన 'బిచ్చగాడు' (Bichagadu) సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు విజయ్ ఆంటోనీ. ఈ మూవీతో తెలుగులో తిరుగులేని మార్కెట్ క్రియేట్ అయింది. ఈ సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేసినప్పుడు తమిళ్‏తో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ మధ్య విడుదలైన పాటలు ఆ హైప్‏ను మరింత పెంచాయి. తాజాగా విడుదల చేసిన బిచ్చగాడు 2 (Bichagadu2) ట్రైలర్ ఆ అంచనాలకు తగ్గట్టుగానే కనిపిస్తోంది. కంప్లీట్ కమర్షియల్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్‎‏తో ట్రైలర్ అంతా ఇంట్రెస్టింగ్ కనిపిస్తూనే ఉంది. ఎస్పెషల్లీ విజయ్ ఆంటోనీ ( Vijay Antony) యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఫస్ట్ పార్ట్‏లో ఒక్కడే రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్‏లో కనిపించాడు. ఈ సారి ఇద్దరిలా కనిపిస్తూ ఆడియన్స్‏లో ఓ క్యూరియాసిటీని క్రియేట్ చేశారు.

ఇంతకుముందు సోషల్ మీడియాలో 'యాంటీ-బిక్లి' అనే కొత్త పదాన్ని ఉపయోగించి 4 నిమిషాల టీజర్, థీమ్ సాంగ్‏ను విడుదల చేస్తూ సినిమా థీమ్‏ను తెలియజేశాడు విజయ్. 'బిక్లి' అంటే పేదవారిని ఆర్థికంగా దోపిడీ చేసే అత్యాశపరుడు అని అర్థం. అయితే బిచ్చగాడు2 (Bichagadu2)లో విజయ్ ఆంటోని యాంటీ బికిలీగా కనిపించబోతున్నాడు. ఇక ట్రైలర్ చూస్తే ఇండియాలో 7వ అత్యంత సంపన్నుడైన విజయ్ గురుమూర్తిగా విజయ్ ఆంటోనీ కనిపిస్తున్నాడు. అందుకు సంబంధించిన ఎస్టాబ్లిష్‏మెంట్ షాట్స్ అన్నీ అదిరిపోయాయి. ఓ రేంజ్‏లో ఇంట్రడ్యూసైన విజయ్.. తర్వాత విమాన ప్రమాదానికి గురవుతాడు. అందుకు కారణం యాంటీ బికిలీ అంటూ మళ్లీ విజయ్ ఆంటోనీ ( Vijay Antony)నే పరిచయం చేయడం సినిమాపై అంచనాలను పెంచుతోంది. విజయ్ గురుమూర్తి మరణానికి సంబంధించిన సీన్స్.. యాంటీ బికిలీ ఎంట్రీ, కోర్ట్ డ్రామా ఇవన్నీ భారీ హైప్‏ను క్రియేట్ చేస్తున్నాయి. దీంతో పాటు ఫ్లాష్ బ్యాక్‍‏లో వచ్చే అన్నా చెల్లెల్ల ఎపిసోడ్ ఆడియన్స్ గుండెలను మరోసారి కట్టిపడేసేలా చూపించబోతున్నట్టు అర్థం అవుతోంది. సీక్వెల్ ట్రైలర్ చూస్తోంటే విజయ్ ఆంటోనీ మరోసారి బ్లాక్ బస్టర్ కంటెంట్‏తోనే వస్తున్నట్టు కనిపిస్తోంది.

విజయ్ ఆంటోనీ సరసన కావ్యా థాపర్ (Kavya Thapar) హీరోయిన్‏గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని మే 19 న విడుదల చేయబోతున్నట్టు ట్రైలర్‏లోనే అనౌన్స్ చేశారు. అంటే ఈ సమ్మర్‏లో 'బిచ్చగాడు2'తో ఆడియన్స్ మరో ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ చూడబోతున్నారని చెప్పొచ్చు. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని, కావ్య థాపర్, దాతో రాధా రవి (Dato Radha Ravi), వై.జి. మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, హరీష్ పెరడి, జాన్ విజయ్, దేవ్ గిల్, యోగి బాబు నటిస్తున్నారు. ఇక ఎడిటింగ్, మ్యూజిక్, విజయ్ ఆంటోనీ, సినిమాటోగ్రాఫర్స్‏గా విజయ్ మిల్టన్, ఓమ్ ప్రకాష్‏గా ఉన్నారు. ఈ చిత్రాన్ని ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మిస్తుండగా విజయ్ ఆంటోని (Vijay Antony) దర్శకత్వం వహిస్తున్నారు.

Updated On 29 April 2023 6:07 AM GMT
Ehatv

Ehatv

Next Story