విద్యా బాలన్ ఈ పేరు వినగానే మనందరికీ ‘ద డర్టీ పిక్చర్’ సినిమా గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆ మూవీలో విద్యా బాలన్ అంత అద్భుతంగా నటించింది. అయితే విద్యాబాలన్ 2005లో వచ్చిన ‘పరిణీత’ చిత్రంతో ఈమె బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత ‘లగే రహో మున్నా భావ్’ ‘భూల్ భులయ్య’, ‘మిషన్ మంగళ్’ లాంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించింది విద్యా బాలన్. బాలీవుడ్ లో తన నటనతో మెప్పించింది.
ఆమె 1978 జనవరి 1న కేరళలో విద్యాబాలన్ జన్మించారు. తండ్రి పి.ఆర్ బాలన్, తల్లి సరస్వతీ బాలన్. చిన్నతనంలోనే మాధురీ దీక్షిత్ నటనతో సినిమాలపై ప్రేరణ కలిగిందట. అలా ఇంట్రెస్ట్ రావడంతో సినిమాల్లో రాణించాలని ఆశపడింది.
పుట్టింది కేరళలో అయినప్పటికీ పెరిగిందంతా ముంబైలోనే. చెంబూరులోని సెయింట్ ఆంథోనీ గల్స్ హయ్యర్ స్కూల్ లో స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసింది. ఆపై సెయింట్ జేవియర్స్ కాలేజీలో సోషియాలజీ డిగ్రీ పూర్తి చేసింది.
విద్యాబాలన్ నటనా విషయానికి వస్తే.. పదహారేళ్ల వయస్సులో ఏక్తాకపూర్ నిర్మించిన ‘ హమ్ పాంచ్’ అనే సీరియల్ లో నటించింది. హీరోయిన్ అవ్వాలనుకుంటున్నట్లు ఇంట్లో చెప్పడంతో ముందు చదువు పూర్తి చేయాలని పేరెంట్స్ చెప్పారట.
అలా ముంబై యూనివర్శిటీ నుంచి సోషయాలజి మాస్టర్ డిగ్రీ పొందారు విద్యాబాలన్. ఇక ఆ తర్వాత బాలన్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడాన్ని మొదలు పెట్టిందట. ఫస్ట్ మలయాళంలో మోహన్ లాల్ సరసన చేసేందుకు సైన్ చేసింది.
కానీ సినిమా నిర్మాణంలో ప్రాబ్లమ్స్ కారణంగా ఆ మూవీని మధ్యలోనే ఆపేశారు. ఇక ఆ కారణంతో మలయాళం ఇండస్ట్రీలో విద్యా బాలన్ ఒక ‘ఐరన్ లెగ్’ గా ముద్ర వేశారు. 2002లో ఆమె ఓ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయినప్పటికీ తర్వాత ఆమెను రీప్లేస్ చేశారు.
ఆ తర్వాత వచ్చిన మరో సినిమాకూ సెలెక్ట్ అయ్యాక ఆమెను మళ్లీ రీప్లేస్ చేశారు. ఇక 2003లో కలారి విక్రమన్ అనే సినిమా పూర్తి చేసినా.. ఆ మూవీ విడుదల అవ్వలేదు. ఇలా కెరీర్ లో విద్యాబాలన్ చాలా కష్టాలు పడింది.
‘లగే రహో మున్నా భాయ్’ ‘భూల్ భులయ్య’, ‘మిషన్ మంగళ్’ లాంటి సినిమాలతో తనేంటో నిరూపించింది. మరోవైపు విద్యకు ‘థాయ్’ వంటలంటే బాగా ఇష్టమట. అవే కాకుండా ఇంట్లో వండే పదార్ధాలే ఎక్కువగా తింటుందట.
ఇక విద్యా బాలన్ మలయాళం, తమిళం, బెంగాలీ భాషలు కూడా మాట్లాడుతుంది. 2012 డిసెంబర్ లో సిద్దార్థ రాయ్ కపూర్ ను పెళ్లి చేసుకుంది విద్యాబాలన్. ఆ తర్వాత చీరలోనే దర్శనమిచ్చే విద్యా చీరకట్టుకే ‘ట్రేడ్ మార్క్ అయింది.
ఆమె కోసం ఫేమస్ డిజైనర్లు పోటీపడి మరీ చీరలు డిజైన్ చేస్తున్నారు. విద్యా బాలన్ నటనకు కేంద్రప్రభుత్వం పద్మశ్రీ అవార్డును అందజేసింది. ఇక సోషల్ మీడియాలో విద్యా ఎప్పుడూ ఫన్నీ రీల్స్ చేస్తూ తన అభిమానులను అలరిస్తుంది. బాలన్ కు 7.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.