నటీనటులు(Actress) కొన్నిసార్లు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇష్టం లేకపోయినా, అలవాటు లేకపోయినా కథ డిమాండ్‌ చేసే సిగరెట్‌(Cigarette) తాగాల్సి ఉంటుంది. మద్యం(alcohol) తాగే సీన్లను ఎలాగోలా మేనేజ్‌చేయవచ్చు కానీ సిగరెట్‌ సీన్లు కష్టమే. అందుకే కష్టమైన దమ్ము కొట్టాల్సిందే. సినిమా కోసం సిగరెట్ తాగేవాళ్లలో చాలా మందికి అదో అలవాటుగా మారుతుంటుంది. నటి విద్యాబాలన్‌కు(Vidya Balan) కూడా ఇలాంటి పరిస్థితే వచ్చింది.

నటీనటులు(Actress) కొన్నిసార్లు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇష్టం లేకపోయినా, అలవాటు లేకపోయినా కథ డిమాండ్‌ చేసే సిగరెట్‌(Cigarette) తాగాల్సి ఉంటుంది. మద్యం(alcohol) తాగే సీన్లను ఎలాగోలా మేనేజ్‌చేయవచ్చు కానీ సిగరెట్‌ సీన్లు కష్టమే. అందుకే కష్టమైన దమ్ము కొట్టాల్సిందే. సినిమా కోసం సిగరెట్ తాగేవాళ్లలో చాలా మందికి అదో అలవాటుగా మారుతుంటుంది. నటి విద్యాబాలన్‌కు(Vidya Balan) కూడా ఇలాంటి పరిస్థితే వచ్చింది. 'సిగరెట్‌ ఎలా తాగుతారో తెలుసు కానీ నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు. డర్టీ పిక్చర్‌(Dirty Picture) సినిమాలో నా పాత్ర సిగరెట్‌(smoking) తాగుతుంటుంది. ఉత్తినే తాగుతున్నట్టుగా నటిస్తే సీన్‌ బాగా రాదు. అందుకే సిగరెట్‌ అలవాటు చేసుకున్నా. సినిమా తర్వాత సిగరెట్‌ మానలేకపోయాను. రోజుకు రెండు మూడు సిగరెట్లు కాలిస్తే తప్ప మనసు ప్రశాంతంగా ఉండేది కాదు. ఆ రోజుల్లో మహిళలు సిగరెట్ తాగుతుంటే అదోలా చూసేవారు. అదో పెద్ద నేరంగా భావించేవారు. ఇప్పుడు అలా కాదు. నిజానికి సిగరెట్‌ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదని ఎవరైనా చెప్పి ఉంటే ఇప్పటికీ ఆ అలవాటును మానుకునేదాన్ని కాదు. ఇప్పుడైతే సిగరెట్లు తాగడం లేదు. కాలేజ రోజుల్లో బస్‌స్టాప్‌లో సిగరెట్ తాగేవారి పక్కన కూర్చున్నప్పుడు ఆ పొగను ఆస్వాదించేదాన్ని. ఆ వాసన నాకు బాగా నచ్చేది' అని విద్యాబాలన్‌ చెప్పుకొచ్చారు. విద్యాబాలన్‌ నటించిన లేటెస్ట్‌ సినిమా దో ఔర్‌ దో ప్యార్‌ థియేటర్లలో నడుస్తోంది.

Updated On 26 April 2024 1:32 AM GMT
Ehatv

Ehatv

Next Story