ఒకప్పుడు భార్యనే భర్తకు సేవలు చేసేది. ఇంట్లో భర్తకు కావాల్సినవన్నీ సమకూర్చేది. స్నానం చేస్తే వీపురుద్దడం, కాళ్లు లాగితే నొక్కడం లాంటివి చేసేవారు. కానీ నవేడేస్ ట్రెండ్ చేంజ్ అయింది. భర్త కూడా తమ భార్యకు సేవలు చేస్తున్నాడు. ఇంటి పనులు, వంట పనుల్లో భార్యకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ఇది తప్పడం లేదు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. మెగా పవర్ స్టార్ తన భార్య కాళ్లు నొక్కుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఉపాసన(Upasana) - రామ్ చరణ్ జంట ఎంత అన్యోన్యంగా ఉంటారో తెలియనిది కాదు. ఏ మాత్రం సమయం దొరికినా ఈ జంట ఒకరి కోసం ఒకరు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుంటారు. క్యూట్ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. 2012 జూన్ 14న ఈ జంట ప్రేమ వివాహం చేసుకుంది. అయితే వీరిద్దరూ శుక్రవారం అనంత్ అంబానీ(Ananth ambani) ప్రీ-వెడ్డింగ్ వేడుకల కోసం ప్రత్యేక విమానంలో గుజరాత్(Gujarath) వెళ్లారు. ఈ సందర్భంగా విమానంలో తన భార్య ఉపాసన కాళ్లు నొక్కుతూ రాంచరణ్ కనిపించారు. దీనిని కొందరు వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే చక్కర్లు కొట్టడం ప్రారంభించింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. బెస్ట్ హస్బెండ్ అవార్డు ఇవ్వాలని ఒకరు.. ఆదర్శ జంట అని మరొకరు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరొకరైతే 'రాంచరణ్ గ్లోబల్ స్టార్ కావొచ్చు.. కానీ నా పాదదాసుడే' అని ఉపాసన వ్యవహారం ఉందన్నట్లుగా ఫన్నీ కామెంట్ చేశాడు.