థియేటర్‌లో పెళ్లి చేసుకున్న ఫ్యాన్‌

ఇవాళ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు(Super star mahesh) పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన ఫ్యాన్స్‌ సంబరాల మీద సంబరాలు చేసుకుంటున్నారు. బర్త్‌డే రోజును పురస్కరించుకున్న ఈ రోజు మురారి(Murari) సినిమా రీ రిలీజ్‌(Re-release) చేశారు. మహేశ్‌బాబు బ్లాక్‌ బస్టర్‌ సినిమాలో మురారి కూడా ఒకటి. కృష్ణవంశీ(Krishna Vamsi) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేశ్‌బాబు సరసన సోనాలి బింద్రే(sonali bindre) నటించింది. 2001లో రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. రీ రిలీజ్‌ లో కూడా ఈ సినిమా థియేట‌ర్‌లో హౌస్‌ఫుల్ షోల‌తో న‌డుస్తుంది. అయితే అభిమానులు ఈ మూవీ చూస్తుండ‌గా.. ఒక ప్రేమ జంట థియేట‌ర్‌లోనే పెళ్లి(Marriage) చేసుకుంది. థియేట‌ర్‌లోకే తాళిబొట్టును తీసుకువచ్చిన వరుడు మహేశ్‌బాబు అభిమానుల ముందే పెళ్లి చేసుకున్నాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతుంది. ఎవడి పిచ్చి వాడికానందం అని పెద్దలు ఊరికే అనలేదు కదా !




Updated On 9 Aug 2024 10:17 AM GMT
Eha Tv

Eha Tv

Next Story