ఎక్కడ చూసినా.. ఏ నోట విన్నా.. బలగం.. బలగం.. ఇదే మాట. గత కొద్ది రోజులుగా ఈ సినిమా ట్రెండింగ్‌లోనే ఉంటోంది. అయితే ఇంకా ఈ సినిమా చూడని వారి కోసం గ్రామాల్లో ప్రత్యేక షోలు కూడా వేస్తున్నారు. బంధాలను కాదనుకుని పంతాలు, పట్టింపులతో మాట్లాడుకోని వారికి మేలుకొలుపే ఈ సినిమా. ఓ కుటుంబంలో కొడుకు, అల్లుడు మధ్య పంతం పట్టింపుతో తండ్రి, కూతురు పడిన మనోవేదనే ఈ సినిమా కథ.
ఎక్కడ చూసినా.. ఏ నోట విన్నా.. బలగం.. బలగం.. ఇదే మాట. గత కొద్ది రోజులుగా ఈ సినిమా ట్రెండింగ్‌లోనే ఉంటోంది. అయితే ఇంకా ఈ సినిమా చూడని వారి కోసం గ్రామాల్లో ప్రత్యేక షోలు కూడా వేస్తున్నారు. బంధాలను కాదనుకుని పంతాలు, పట్టింపులతో మాట్లాడుకోని వారికి మేలుకొలుపే ఈ సినిమా. ఓ కుటుంబంలో కొడుకు, అల్లుడు మధ్య పంతం పట్టింపుతో తండ్రి, కూతురు పడిన మనోవేదనే ఈ సినిమా కథ. కుటుంబంలో పెద్దాయన చనిపోయాక 11 రోజుల పిండం కాకి ముట్టకపోవడం అనే సమస్యను ఎలా సాల్వ్ చేశారనేది ఈ చిత్రం చూసినవాళ్లకు అర్ధమవుతుంది. తెలంగాణ యాస, భాష, ప్రాంతాలతో వచ్చిన ఈ సినిమాకు మంచి ఆధరణ లభిస్తోంది. థియేటర్లలో పెద్ద హిట్‌గా నిలిచి.. ఓటీటీ(OTT)లోకి వచ్చాక కూడా ఈ సినిమా రేంజ్ ఎక్కడ తగ్గడం లేదు. ఇక గ్రామాల్లోని పంచాయతీల ఆవరణలో, పాఠశాలల ఆవరణలో ఈ చిత్రం షోలు వేయడం.. పూర్వకాలాన్ని గుర్తు తెస్తున్నాయంటున్నారు జనాలు.
ఇదిలా ఉంటే ఈ సినిమా చూసిన వాళ్లు చాలా వరకు బంధాలు, రక్తసంబంధాలకు విలువ ఇస్తున్నారు. పంతాలు, పట్టింపులు ఉన్న వాళ్లని ఈ చిత్రం మారుస్తోందని చెప్పాలి. రీసెంట్గా లింగాల ఘనపురంలో విడాకులు తీసుకున్న అక్కా, తమ్ముడి కుటుంబాలను ఒక్కటి చేసింది ఈ బలగం సినిమా. తెలంగాణ ప్రజల ఎమోషన్స్‌తో కూడుకున్న ఈ సినిమాకు ఎక్కడ చూసినా బలగం(Balagam).. మా బలం అంటూ ఈ సినిమాకు జై కొడుతున్నారు జనాలు. ఇదిలా ఉంటే ఇక ఈ సినిమాకు ఇప్పటికే చాలా అవార్డులు వచ్చాయి. అయితే తాజాగా 40కిపైగా ఇంటర్నేషనల్ అవార్డులను అందుకుందట ఈ బలగం(Balagam) చిత్రం. ఈ విషయాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్(Dil Raju Productions) సంస్థ వాళ్లు అఫిషియల్‌గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఇంతటి ఘన కీర్తి దక్కటానికి బలగం సినిమా టీమ్ హార్డ్ వర్క్, కమిట్ మెంట్ అంటూ దిల్ రాజు ప్రొడక్షన్ సంస్థ ట్విటర్ ద్వారా తెలిపింది.