మొదటి సినిమాతోనే సూపర్‌హిట్‌ కొట్టిన దర్శకులు కొద్ది మందే ఉంటారు. అందులో వేణు యెల్దండి(Venu Yeldandi) ఒకరు. జబర్దస్త్‌(Jabardast) కామెడీ షోతో మంచి పేరు తెచ్చుకున్న వేణు .. తర్వాత సినిమాల్లో దొరికిన వేషాలన్నీ వేశారు. సినిమా పట్ల తనకున్న అభిరుచిని చాటుకుంటూ దర్శకుడిగా మారారు.

మొదటి సినిమాతోనే సూపర్‌హిట్‌ కొట్టిన దర్శకులు కొద్ది మందే ఉంటారు. అందులో వేణు యెల్దండి(Venu Yeldandi) ఒకరు. జబర్దస్త్‌(Jabardast) కామెడీ షోతో మంచి పేరు తెచ్చుకున్న వేణు .. తర్వాత సినిమాల్లో దొరికిన వేషాలన్నీ వేశారు. సినిమా పట్ల తనకున్న అభిరుచిని చాటుకుంటూ దర్శకుడిగా మారారు. బలగం(Balagam) సినిమాను రూపొందించారు. ఆ సినిమా ఊహించనంత విజయం సాధించింది. తెలంగాణలో ప్రతీ గ్రామంలో ఎల్‌ఈడీ తెరపై సినిమాను ప్రదర్శించారు. గ్రామ ప్రజలంతా కలిసి కూర్చొని సినిమాను చూశారు.

భావోద్వేగాలకు లోనయ్యారు. నిజానికి వేణులో ఇంత గొప్ప దర్శకుడు ఉన్నాడన్న సంగతి బలగం వచ్చిన తర్వాతే తెలిసింది. మెగాస్టార్‌ చిరంజీవి కూడా వేణు టాలెంట్‌ చూసి ఆశ్చర్యపోయారు. చిరంజీవి(chiranjeevi) ఒక్కరే కాదు, చాలా మంది ప్రముఖులు వేణుపై ప్రశంసలు కురిపించారు. ఓటీటీలో వచ్చినప్పటికీ థియేటర్లు ఫుల్లవ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఆ ఘనత బలగం సాధించింది. ఇప్పుడు వేణు తన తర్వాతి సినిమాపై కసరత్తులు చేస్తున్నారు. దర్శకుడిగా తనకు అవకాశం ఇచ్చిన దిల్‌రాజ్‌(Dil Raju) బ్యానర్‌లోనే ఈ సినిమా కూడా ఉంటుందని ఎప్పుడో చెప్పారు వేణు.

దిల్‌రాజ్‌ కూడా వేణు ఎప్పుడు అడిగితే అప్పుడు సినిమా తీయడానికి సిద్ధం అని చెప్పారు. అయితే తర్వాతి సినిమా ఏ విధంగా ఉండబోతున్నది, ఎలాంటి కథను ఎన్నుకుంటున్నారన్నది మాత్రం సస్పెన్స్‌గానే ఉంది. ఏ హీరోతో తీస్తారన్నది కూడా వేణు చెప్పలేదు కానీ సోషల్‌ మీడియాలో మాత్రం ఓ వార్త చక్కర్లు కొడుతోంది. వేణు తన రెండో సినిమాను నందమూరి బాలకృష్ణతో(Balakrishna) ప్లాన్‌ చేస్తున్నారట. ఇప్పటికే బాలకృష్ణకు కథ చెప్పారట.

వేణు చెప్పిన కథ బాలయ్యకు బాగా నచ్చిందట. ఈ 'ట'లు నిజమైతే మాత్రం వేణుకు బ్రహ్మండమైన ఛాన్స్‌ దొరికినట్టే! ప్రస్తుతం అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో బాలయ్య తన 108వ సినిమా చేస్తున్నారు. విరూపాక్షతో హిట్‌ కొట్టిన కొత్త దర్శకుడు కార్తిక్‌ దండు కూడా బాలయ్యకు ఓ కథ చెప్పారట. ఈ కాంబినేషన్‌ కూడా సెట్టవ్వాల్సి ఉంది. బాలయ్యకు హ్యాట్రిక్‌ విజయాలను అందించిన బోయపాటితో కూడా బాలయ్య ఓ సినిమా చేయబోతున్నారు.

Updated On 10 May 2023 1:12 AM GMT
Ehatv

Ehatv

Next Story