వేణుస్వామి(venu swamy) సోషల్‌ మీడియా(Social media) వచ్చిన తర్వాత ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా వాళ్ల జాతకాలు చెప్తూ.. వారితో పూజలు చేయిస్తూ.. యూట్యూబ్‌ చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ.. ఫేమస్ అయ్యారు.

వేణుస్వామి(venu swamy) సోషల్‌ మీడియా(Social media) వచ్చిన తర్వాత ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా వాళ్ల జాతకాలు చెప్తూ.. వారితో పూజలు చేయిస్తూ.. యూట్యూబ్‌ చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ.. ఫేమస్ అయ్యారు. నాగ చైతన్య(Naga chaithanya)-సమంత(Samantha) విడిపోతారని చెప్పడం.. వారు విడిపోవడంతో ఇతని వ్యాఖ్యలకు మరింత ప్రచారం వచ్చింది. టాలీవుడ్‌ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో రష్మికతో(Rashmika) కూడా పూజలు చేయించడం చూశాం. తమ కెరీర్ బాగుండాని కోరుకునేవారు వేణుస్వామితో పూజలు, యాగాలు, హోమాలు చేయించుకుంటుంటారు.

తాజాగా మరో హీరోయిన్‌ డింపుల్‌ హయతితో(Dimple hayathi) కూడా వేణుస్వామి పూజలు చేయించారు. తన కెరీర్‌ బాగుండాలన్న ఉద్దేశంతో వేణుస్వామితో డింపుల్ హయతి పూజలు చేసుకున్నారు. ఈమెతో చేయించిన పూజల్లో వైన్‌ బాటిల్‌(Wine bottle) దర్శనం ఇచ్చింది. ఈ పూజల ఫొటోలు బయటకురావడంతో వేణుస్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. ఓ ఇంట్లో పెద్ద ముగ్గు, దాని నిండా పూలు, పళ్లు ఉంచడమే కాకుండా వైన్‌ బాటిళ్లు కూడా అందులో పెట్టి ఉన్నాయి. రామబాణం సినిమాలో కనిపించిన డింపుల్ హయతి.. తనకు మరిన్ని అవకాశాలు రావాలని కోరుతూ వేణుస్వామితో పూజలు చేయించింది. చాలా కాలంగా ఆమెకు ఇండస్ట్రీలో సక్సెస్ లేనందునే ఈ పూజలు చేయించుకుందని అంటున్నారు. అయితే ఆ పూజల్లో వైన్ బాటిళ్లు కనపడడంతో దానిపైనే చర్చ జరుగుతోంది. దీనిపై వేణుస్వామి స్పందిస్తూ .. అవును అవి మందు బాటిళ్లేనని ఒప్పుకున్నారు. తన పూజల్లో మంచినీటితో పాటు, కూల్‌డ్రింక్‌ లేదా వైన్‌ లేదా విస్కీ బాటిళ్లు ఉంచుతానని చెప్పుకొచ్చారు. ఎవరికి ఏది ఇష్టం ఉంటే ఆ బాటిల్‌ను పూజలో ఉంచుతానని చెప్పారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated On 6 March 2024 1:24 AM GMT
Ehatv

Ehatv

Next Story