విక్టరీ వెంకటేశ్‌(Venkatesh) హీరోగా నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌(Niharika Entertainment) బ్యానర్‌పై రూపొందుతున్న సినిమా సైంధవ్‌. ఇందులో హీరోయిన్లుగా శ్రద్ధా శ్రీనాథ్‌(Shraddha Srinath), రుహానీ శర్మ(Ruhani Sharma), ఆండ్రియా జెర్మియా(Andrea Jeremiah) నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ(Nawazuddin Siddiqui) కీలక పాత్ర పోషిస్తున్నాడు.

విక్టరీ వెంకటేశ్‌(Venkatesh) హీరోగా నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌(Niharika Entertainment) బ్యానర్‌పై రూపొందుతున్న సినిమా సైంధవ్‌. ఇందులో హీరోయిన్లుగా శ్రద్ధా శ్రీనాథ్‌(Shraddha Srinath), రుహానీ శర్మ(Ruhani Sharma), ఆండ్రియా జెర్మియా(Andrea Jeremiah) నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ(Nawazuddin Siddiqui) కీలక పాత్ర పోషిస్తున్నాడు. వెంకట్‌ బోయనపల్లి(Venkat Boyanapally) నిర్మిస్తున్న ఈ చిత్రానికి హిట్‌ ఫేమ్‌ శైలేష్‌ కొలను(Shailesh Kolanu) దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్‌ ప్రధానంగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. బుధవారంతో ఓ కీలక షెడ్యూల్‌ చిత్రీకరణని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఒక వీడియోను రిలీజ్‌ చేసింది. పాన్‌ ఇండియా సినిమాగా రూపొందుతున్న సైంధవ్‌(Saindhav) సినిమాను డిసెంబరు 22న దక్షిణాది భాషలతో పాటు హిందీలో విడుదల చేయనున్నారు. సైంధవ్‌ సినిమా వెంకటేష్‌ 75వ చిత్రమవ్వడం మరో విశేషం. ఈ సినిమాకు సంతోష్‌ నారాయణన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

Updated On 29 Jun 2023 7:28 AM GMT
Ehatv

Ehatv

Next Story