వెంకటేశ్(Vnkatesh), రానా(Rana) నటించిన రానానాయుడు(Rana Naidu) వెబ్ సిరీస్‌పై అనేక విమర్శలు వచ్చాయి. పచ్చి బూతులు ఉన్నాయని చాలా మంది తిట్టిపోశారు. వెంకటేశ్ వంటి నటుడి నోటి వెంట ఇలాంటి మాటలు రావడం తమకు నచ్చలేదని అభిమానులు కూడా నొచ్చుకున్నారు.
వెంకటేశ్(Venkatesh), రానా(Rana) నటించిన రానానాయుడు(Rana Naidu) వెబ్ సిరీస్‌పై అనేక విమర్శలు వచ్చాయి. పచ్చి బూతులు ఉన్నాయని చాలా మంది తిట్టిపోశారు. వెంకటేశ్ వంటి నటుడి నోటి వెంట ఇలాంటి మాటలు రావడం తమకు నచ్చలేదని అభిమానులు కూడా నొచ్చుకున్నారు. ఇన్నేసి విమర్శలు వచ్చినా ఇప్పటి వరకు వెంకటేశ్ దీనిపై స్పందించలేదు. ఇంతకాలానికి పెదవి విప్పారు. రానానాయుడులోని కొన్ని సన్నివేశాలు కొందరికి నచ్చలేదన్న విషయం నిజమేనని ఒప్పుకున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో(Netflix) స్ట్రీమింగ్ అవుతున్న ఈ యాక్షన్ క్రైమ్ డ్రామా సిరీస్ చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు.
ఫ్యామిలీ హీరోగా పేరొందిన వెంకటేశ్ అభిమానులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. చాలా సన్నివేశాలలో శ్రుతి మించిన శృంగార సన్నివేశాలు ఉన్నాయి. అసభ్య పదజాలం కూడా ఉన్నాయి. డబుల్ మీనింగ్ డైలాగులకు అయితే లెక్కేలేదు. సోషల్ మీడియాలో ఈ వెబ్ సిరీస్‌పై చాలానే విమర్శలు వచ్చాయి. దీనిపై ఇప్పటికే రానా స్పందించారు. ఇప్పుడు వెంకటేశ్ మొదటిసారి తన రియాక్షన్ ఏమిటో చెప్పారు. అభిరామ్(Abhiram) హీరోగా నటిస్తున్న అహింస(Ahimsa) సినిమా ప్రమోషన్‌లో భాగంగా ప్రెస్‌తో వెంకటేశ్ మాట్లాడారు. రానానాయుడుపై వచ్చిన విమర్శలపై మీ స్పందన ఏమిటి అని అడిగిన ప్రశ్నకు మొదట సమాధానం చెప్పడానికి ఇష్టపడలేదు.
ఇది సరైన వేదిక కాదని, మరోసారి మాట్లాడుకుందామని దాటవేసేందుకు ప్రయత్నించారు. అయితే విలేకరి వదలకుండా మరోసారి ప్రశ్నించారు. అప్పుడు వెంకటేశ్ తన అభిప్రాయాన్ని చెప్పారు. రానానాయుడు సిరీస్‌పై నెట్‌ఫ్లిక్స్(Netflix) మాత్రం చాలా సంతోషంగా ఉందన్నారు. చాలా మంది నుంచి ఫీడ్‌బ్యాక్ వచ్చిందని, జరిగిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చోవడం కంటే ముందుకు వెళ్లడమే మంచిదని తాను నమ్ముతానని అన్నారు. తర్వాతి సీజన్‌ను అందరికీ నచ్చేలా తీస్తామని, అలాగని అందరినీ మెప్పించడం కూడా కష్టమేనని చెప్పారు.
ఒకటి మాత్రం చెప్పగలనని, మొదటి సీజన్‌లో కొన్ని సన్నివేశాలు, వాటిని తీసిన విధానం ప్రభావం చూపిన మాట వాస్తవమేనని అంగీకరించారు వెంకటేశ్. మొదటి సీజన్‌తో పోలిస్తే రెండో సీజన్‌కు ప్రేక్షకులు పెరుగుతారని, అందరికీ నచ్చే విధంగా ఉత్తమమైన కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. నంది అవార్డుల గురించి మాట్లాడుతూ, అవార్డుల గురించి తాను ఎక్కువ ఆలోచించనని అన్నారు. అయితే, అవార్డులు ఇస్తే ప్రతి నటుడికీ ప్రోత్సాహంగా ఉంటుందన్నారు. అభిరామ్ నటించిన ‘అహింస’ హిట్టవ్వాలని వెంకటేశ్ ఆకాంక్షించారు.