ప‌రుగెత్తి పాలు తాగ‌డం కంటే నిల‌బ‌డి నీళ్లు తాగ‌డమే బెట‌ర‌నుకుంటాడు విక్ట‌రీ వెంక‌టేశ్‌..అలాగ‌ని చ‌తికిల‌బ‌డుతున్నారా అంటే అదీ లేదు. ప్లానింగ్‌.. జ‌స్ట్ ప్లానింగ్‌..కెరీర్ బిగినింగ్ నుంచి ఇదే స్ట్రాట‌జీని ఫాలో అవుతున్నారు. త‌ను చేస్తున్న‌, చేయ‌బోతున్న పాత్ర‌ల‌కు సంబంధించి విప‌రీత‌మైన క‌స‌ర‌త్తు చేయ‌డ‌మ‌న్న‌ది వెంక‌టేశ్ రెగ్యుల‌ర్ హేబిట్‌.

ప‌రుగెత్తి పాలు తాగ‌డం కంటే నిల‌బ‌డి నీళ్లు తాగ‌డమే బెట‌ర‌నుకుంటాడు విక్ట‌రీ వెంక‌టేశ్‌..అలాగ‌ని చ‌తికిల‌బ‌డుతున్నారా అంటే అదీ లేదు. ప్లానింగ్‌.. జ‌స్ట్ ప్లానింగ్‌..కెరీర్ బిగినింగ్ నుంచి ఇదే స్ట్రాట‌జీని ఫాలో అవుతున్నారు. త‌ను చేస్తున్న‌, చేయ‌బోతున్న పాత్ర‌ల‌కు సంబంధించి విప‌రీత‌మైన క‌స‌ర‌త్తు చేయ‌డ‌మ‌న్న‌ది వెంక‌టేశ్ రెగ్యుల‌ర్ హేబిట్‌. సినిమా సినిమాకి, పాత్రపాత్రకీ డిఫరెన్స్ కోసం వెంకీ మామా పడే తాపత్రయం ఇంతా అంతా కాదు. కమర్షియల్ హిట్స్ చేస్తున్న‌ తొలిరోజుల్లో మధ్యలో కేవలం తనని తాను ఓ మంచి నటుడుగా నిరూపించుకోవడానికి ధర్మచక్రం అనే సినిమా చేశాడు. అంత‌కు ముందు శ‌త్రువు చేశాడు. అలా వైవిధ్యమైన పాత్రలు చేయడానికి తాప‌త్ర‌య‌ప‌డే వెంకటేశ్‌ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ సీరీస్ కి రానాతో కలసి చాలా డిఫరెంట్‌గా ఫాదర్ పాత్రంలో వైట్ హెయిర్ అండ్ బియర్డ్ గెటప్ లో కనిపించడానికి సిద్ధపడ్డాడు.

నాగ పేరుతో ఈ ఫాదర్ పాత్ర పూర్తిగా రఫ్ అండ్ టఫ్ గా కనిపించి, ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడానికి తపన పడుతున్నాడు మన వెంకీ మామ. అయితే లిస్ట్ లో చేయబోతున్న తదుపరి చిత్రం పేరు కూడా పూర్తిగా విభిన్నంగా ఉంది. సైంధవ్...ఫుల్ లెంత్ ఫామిలీ హీరోగా పేరు పడ్డ వెంకటేష్ మ‌హాభార‌తంలో పాండవులను అడ్డగించి, అభిమన్యుడు ఛావుకి పరోక్షంగా కారణమైన సైంధవ్ అనే టైటిల్ చేస్తున్నాడంటే ....రియల్లీ హేట్సాఫ్ టు వెంకటేశ్‌. దీనికి ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను. గెటప్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తోంది. ఏమిటా టైటిల్ ? ఏంటా గెటప్? అని అడిగితే మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. మళ్ళీ ఇందులో హీరోయిన్లు ఇద్దరు. మాస్ టచ్ కోసమా? ప్రస్తుతానికి సమాధానం మాత్రం లేదు. సీతారామం చిత్రంతో పాప్యులర్ అయిన మృణాళి ఠాకూర్ ఒక హీరోయిన్ అయితే మ‌రొక‌రు రుహానీ శ‌ర్మ‌.

ఇద్దరుు హీరోయిన్లలో ఒకరు చనిపోతారని స్టోరీ డిపార్ట్‌మెంట్ ఇన్ఫో. ఈ నెలాఖరుకు షూటింగ్ మెదలు పెట్టబోతున్న సైంధవ్ చిత్రం కోసం హైదరాబాద్ అల్యుమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ వర్క్ జరుగుతోంది. ఈ భారీ షెడ్యూల్ పూర్తయిన అనంతరం వైజాగ్ షెడ్యుల్ జరుగుతుందట.

Updated On 10 March 2023 3:15 AM GMT
Ehatv

Ehatv

Next Story