మలయాళ సినిమా దృశ్యం(Drushyam) సినిమా ఓ సంచలనం. మోహన్‌లాల్(Mohanlal) కథనాయకుడిగా జీతూ జోసెఫ్(Jeetoo Joseph) డైరెక్షన్‌లో వచ్చిన ఆ సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్‌హిట్టయింది. తెలుగులో వెంకటేశ్(Venkatesh) హీరోగా అదే పైరుతో వచ్చింది.
మలయాళ సినిమా దృశ్యం(Drushyam) సినిమా ఓ సంచలనం. మోహన్‌లాల్(Mohanlal) కథనాయకుడిగా జీతూ జోసెఫ్(Jeetoo Joseph) డైరెక్షన్‌లో వచ్చిన ఆ సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్‌హిట్టయింది. తెలుగులో వెంకటేశ్(Venkatesh) హీరోగా అదే పైరుతో వచ్చింది. హిందీలోనూ దృశ్యం పేరుతో అజయ్‌దేవగణ్‌తో(Ajay Devgan) రీమేక్ చేశారు. అక్కడా హిట్ కొట్టింది. తమిళంలో పాపనాశనం పేరుతో కమలహాసన్(Kamal Hassan) హీరోగా తీశారు. అది కూడా హిట్టే! కన్నడలో దృశ్య పేరుతో వచ్చింది. అక్కడా సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా దృశ్యం-2 తీశారు. అది కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు దృశ్యం సిరీస్ కొరియన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.
ప్రముఖ భారతీయ సినిమా నిర్మాణ సంస్థ మనోరమ స్టూడియోస్(Manorama Studios), దక్షిణ కొరియాకు(South Korea) చెందని ఆంథాలజీ స్టూడియోస్(Anthology Studios) సంయుక్తంగా ఈ సినిమాలను నిర్మించబోతున్నాయి. పారాసైట్(Parasite) నటుడు సాంగ్ కాంగ్-హో(Song Kang-ho) ఇందులో కథానాయకుడిగా నటించనున్నారు. కేన్స్ ఫిలిం(Cannes film festival) ఫెస్టివల్ వేదికగా అధికారికంగా ఈ ప్రకటన చేశాయి నిర్మాణ సంస్థలు. కొరియన్ భాషలోకి రీమేక్ అవుతున్న తొలి చిత్రంగా ‘దృశ్యం’ నిలవనుంది. కొరియా సినిమాలను మనవాళ్లు కాపీ కొట్టేసి సినిమాలు తీయడం చూశాం కానీ, మన సినిమాను కొరియా వాళ్లు తీస్తుండటం గొప్ప విశేషమే! దృశ్యం’(Drushyam) ఫ్రాంచైజీ చిత్రాలు కొరియన్ భాషలో పునర్నిర్మించడం పట్ల చాలా ఉత్సుకతతో ఉన్నానని, ఈ కథ ఎక్కువమంది ప్రేక్షకులకి చేరువ కావడమే కాదు, హిందీ సినిమాని ప్రపంచ పటంలో నిలపనుంది అని నిర్మాత కుమార్ మంగత్ పాఠక్ అన్నారు. అన్నట్టు మలయాళంలో ఇప్పుడు దృశ్యం-3 సినిమా కూడా రాబోతున్నది. ఇందులో కూడా మోహన్‌లాల్- మీనాలే హీరో హీరోయిన్లు! జీతూ జోసెఫ్ దర్శకుడు.