నందమూరి ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో నందమూరి తారక రామారావు.

నందమూరి ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో నందమూరి తారక రామారావు. నందమూరి హరికృష్ణ కుమారుడైన ఈయనను హీరోగా పరిచయం చేస్తూ దర్శక, నిర్మాత వై.వి.ఎస్‌.చౌదరి(YVS Chowdhary) ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో వీణారావు (Veenarao)హీరోయిన్‌గా నటించనుంది. అచ్చమైన తెలుగమ్మాయి వీణరావు ఫస్ట్‌ లుక్‌ను నిర్మాతలు సుప్రియ యార్లగడ్డ, స్వప్నదత్‌లు లాంచ్‌ చేశారు. పాత్రోచితంగా నటిస్తూ ప్రేక్షకులను మన్ననలను పొందడానికి తన వంతు కృషి చేస్తానంటూ ఆమె అభిమాన నటి డాక్టర్‌ పి.భానుమతి రామకృష్ణ మీద ప్రమాణం చేశారు వీణారావు. కూచిపూడి నృత్యాన్ని అభ్యసించిన వీణారావు అనేక డాన్స్‌ ప్రొగ్రామ్‌లు ఇచ్చారు. నటనలో కూడా రాణించగలరన్న ఆశాభావాన్ని దర్శకుడు వైవీఎస్‌ చౌదరి వ్యక్తం చేశారు. ఈ సినిమాకు సాయి మాధవ్‌ బుర్రా మాటలు అందిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం, చంద్రబోస్‌ సాహిత్యం వహిస్తున్నారు

ehatv

ehatv

Next Story