మెగా హీరో వరుణ్‌తేజ్(Varun tej), దర్శకుడు కరుణ కుమార్(Karun Kumar) కాంబినేషన్‌లో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతోందన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మోహన్ చెరుకూరి(Mohan Cherukuri), విజేందర్ రెడ్డి తీగల(Vijender Reddy Thigala) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వరుణ్‌తేజ్‌కు జంటగా మీనాక్షి చౌదరి(Meenakshi Chowdhary) నటిస్తున్నారు.

Varun Tej New Pan India Movie
మెగా హీరో వరుణ్‌తేజ్(Varun tej), దర్శకుడు కరుణ కుమార్(Karun Kumar) కాంబినేషన్‌లో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతోందన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మోహన్ చెరుకూరి(Mohan Cherukuri), విజేందర్ రెడ్డి తీగల(Vijender Reddy Thigala) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వరుణ్‌తేజ్‌కు జంటగా మీనాక్షి చౌదరి(Meenakshi Chowdhary) నటిస్తున్నారు. గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమాకు మట్కా(Matka) అనే పేరును ఖాయం చేశారు. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. దర్శకుడు మారుతి కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
ప్రారంభ సన్నివేశానికి దిల్‌రాజు(Dil Raju) గౌరవ దర్శకత్వం వహించారు. సురేశ్‌బాబు స్క్రిప్ట్ అందించారు. హరీశ్ శంకర్ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇలా అతిరథులందరూ తలోచేయి వేశాయి. మట్కా అనేది ఒక రకమైన జూదం. 1958-1982 మధ్య జరిగే కథగా ఈ సినిమా ఉండబోతున్నది. అప్పట్లో దేశమంతటిని కదిలించిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇది పూర్తిగా వైజాగ్ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో వరుణ్ తేజ్ నాలుగు భిన్నమైన గెటప్పులలో కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం ఆరో దశకంలో వైజాగ్‌ను తలపించే భారీ వింటేజ్ సెట్‌ను నిర్మించబోతున్నామని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాలో నోరా ఫతేహి కీలక పాత్రతో పాటు ప్రత్యేక పాటలో కనిపిస్తారు. నవీన్ చంద్ర, కిషోర్ తదితరులు ప్రధాన భూమికలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని జీవీ ప్రకాశ్‌కుమార్ అందిస్తున్నారు.
